బ్రేకింగ్ : అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం.. విమానంలో 242 మంది ప్రయాణికులు, మాజీ సీఎం

గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో గురువారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది.;

Update: 2025-06-12 09:19 GMT
బ్రేకింగ్ : అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదం.. విమానంలో 242 మంది ప్రయాణికులు, మాజీ సీఎం

గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో గురువారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం.

విమానం కుప్పకూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. రెస్క్యూ టీమ్‌లు, అగ్నిమాపక దళాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాదం తీవ్రత ఎంతో ఎక్కువగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు మరణాల సంఖ్యపై స్పష్టత రాలేదు కానీ, భారీ ప్రాణనష్టం జరిగే అవకాశముందని సమాచారం.

ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో ఆయన గాయపడ్డట్టు సమాచారం. విజయ్ రూపానీతో పాటు మరికొందరు ముఖ్య రాజకీయ నాయకులు కూడా ఈ విమానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వారందరినీ స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన కొన్ని షాకింగ్ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రమాద స్థలంలో బంధువుల రోదనలు, శోకసంద్రంలో మునిగిపోయిన ప్రజలు కనిపిస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. పూర్తి సమాచారం రాగానే మరిన్ని వివరాలు అందించబడతాయని అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు కూడా ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News