అత్యంత కీలక పరిణామం... బ్లాక్‌ బాక్స్‌ డేటా డౌన్‌ లోడ్‌ కంప్లీట్!

అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-26 09:37 GMT

జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ లో అత్యంత ఘోర విమానప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ తో పాటు ప్రపంచం మొత్తం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 241 మందితో పాటు బయట ఉన్న ప్రజలు 34 మంది మరణించారు. ఈ క్రమంలో దీనికి సంబంధించిన దర్యాప్తులో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురన సంగతి తెలిసిందే. 275 మందిని బలి తీసుకున్న ఈ ఘటనకు గల కారణాలపై ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టింగ్‌ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సమయంలో... ప్రమాదానికి గురైన విమానం బ్లాక్‌ బాక్స్‌ నుంచి డేటా అనాలసిస్ కు మార్గం సుగమమైంది.

ఇందులో భాగంగా.. ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమనానికి సంబంధించిన డేటాను ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టింగ్‌ బ్యూరో (ఏఏఐబీ) ల్యాబ్‌ విజయవంతంగా డౌన్‌ లోడ్‌ చేసింది. ఈ విషయాన్ని తాజాగా భారత పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు గురువారం 'ఎక్స్' వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇందులో భాగంగా... ప్రమాదం తర్వాత ఆ ఘటనపై దర్యాప్తునకు జూన్‌ 13న ఎయిర్‌ క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టింగ్‌ బ్యూరో (ఏఏఐబీ) టీమ్ ను ఏర్పాటు చేసిందని.. దీనికి ఏఏఐబీ డీజీ నేతృత్వం వహిస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలో.. అదే రోజున ఘటనాస్థలంలోని బిల్డింగ్ రూఫ్‌ టాప్‌ పై కాక్‌ పిట్‌ వాయిస్‌ రికార్డర్లు, ఫ్లైట్‌ డేటా రికార్డర్లను గుర్తించామని వెల్లడించింది.

ఆ సమయంలో బ్లాక్ బాక్సులను కూడా స్వాధీనం చేసుకుని ఢిల్లీకి తరలించామని.. ఈ క్రమంలో జూన్‌ 24 నుంచి వీటిల్లోని డేటాను బయటకు తీసే ప్రక్రియను టెక్నికల్ టీమ్ ప్రారంభించిందని తెలిపింది. అనంతరం జూన్ 25న మెమొరీ మాడ్యూల్‌ ను విజయవంతంగా యాక్సెస్‌ చేసి, అందులోని డేటాను ఏఏఐబీ ల్యాబ్‌ లో డౌన్‌ లోడ్‌ చేశామని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో.. కాక్‌ పిట్‌ వాయిస్‌ రికార్డర్‌, ఫ్లైట్‌ డేటా రికార్డర్‌ లో ఉన్న డేటా అనాలసిస్ కొనసాగుతోందని.. దీంతో ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఏమి జరిగిందో తెలుసుకునేందుకు, ప్రమాద కారణాలను వెలికితీసేందుకు అవకాశం ఏర్పడిందని భారత పౌర విమానయాన శాఖ తమ ప్రకటనలో వెల్లడించింది.

Tags:    

Similar News