భార్యను పిల్లలను కొట్టేందుకు కొత్త చట్టం

ఇదేమి చట్టమని అనుకోమాకండి. చట్టం ఏదైనా చేయవచ్చు. ఏ రకమైన రాజ్యాంగం అయినా రాసుకోవచ్చు.;

Update: 2026-02-20 03:47 GMT

ఇదేమి చట్టమని అనుకోమాకండి. చట్టం ఏదైనా చేయవచ్చు. ఏ రకమైన రాజ్యాంగం అయినా రాసుకోవచ్చు. అమలు కూడా చేయవచ్చు. ప్రజాస్వామ్యం లేని చోట వాటికే ప్రాధాన్యత ఉంటుంది కూడా. ఇంతకీ కొత్త చట్టాలు ఏకంగా భార్యను పిల్లలను కొట్టేందుకు మగవారికి హక్కులు ఇచ్చే చట్టాలను ఎక్కడ తయారు చేస్తున్నారు, ఎక్కడ అమలు చేస్తున్నారు అన్నది చూస్తే కనుక తాలిబన్ల రాజ్యంలో అని చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ ని 2021 ఆగస్టులో తిరిగి స్వాధీనం చేసుకున్నాక తాలిబన్లు తమ రాజ్యాన్ని స్థాపించి పాలన చేస్తున్నారు. ఇప్పటికి అయిదేళ్ళుగా అక్కడ వారి పాలన సాగుతోంది. ఈ క్రమంలో మహిళల పట్ల కఠినంగా వ్యవహరించే చట్టాలు ఎన్నో వచ్చాయని చెబుతారు. ఆ వరసలోనే ఇపుడు కొత్తగా ఒక చట్టం వచ్చింది అని అంటున్నారు.

ఈ చట్టమేంటంటే :

ఇక తాలిబాన్ శిక్షాస్మృతిలో ఉన్న కొత్త చట్టంలో తమ ఇంటి ఇల్లాలుని మగవారు కొట్టే హక్కుని ఇస్తుంది వారికి ఎముకలు ఎముకలు విరగకుండా గాయాల పాలు కాకుండా భార్యలను పిల్లలను ఇంటి యజమాని కొట్టడానికి ఈ చట్టం ప్రకారం అనుమతి ఉంది. కొత్త శిక్షాస్మృతి భర్తలు తమ భార్యలను పిల్లలను విరిగిన ఎముకలు లేదా బహిరంగ గాయాలకు గురికానంత వరకు ఏ విధమైన తీరులో అయినా శారీరకంగా శిక్షించడానికి ఈ చట్టం పూర్తిగా అనుమతిస్తుంది.

తరగతుల వారీగా :

ఇక తాలిబన్ నాయకుడు నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా సంతకం చేసిన ఈ చట్టం సామాజిక తరగతి ఆధారంగా ప్రజలను భిన్నంగా శిక్షిస్తుందని చెబుతున్నారు. అంటే సమాజాన్ని మత పండితులు, ఉన్నత వర్గం, మధ్య తరగతి దిగువ తరగతిగా ఈ కొత్త చట్టం విభజిస్తుంది. ఈ చట్టం ప్రకారం ఎముకలు విరిగేలా కొట్టిన భర్తలు కనుక మత పండితుల జాబితాలో ఉంటే వారికి అలా చేయవద్దు అని ఒక సలహా మాత్రమే ఇచ్చి చట్టం వదిలేస్తున్నది. అదే దిగువ తరగతి వర్గాలు అయితే వారు జైలు లేదా శారీరక శిక్షను ఎదుర్కొంటారని చట్టం చెబుతోంది.

నిరూపించడం ఎలా :

అయితే భార్యలు తమ భర్త ఎముకలు విరిగేలా కొట్టాడని ఎలా నిరూపిస్తారు అన్నదే ఈ చట్టంలో అర్ధం కాని విషయం అని అంటున్నారు తమ భర్త బహిరంగంగా కనిపించే గాయాలకు కారకుడు అని బాధిత భార్యలు చెబితే ఆయా భర్తలకు 15 రోజులు శిక్ష విధించవచ్చు అని చట్టం చెబుతోంది. అయితే బాధిత భార్యలు అయిన వారు కోర్టులో తమ భర్తలు పెట్టే అతి భయంకరమైన శారీరక వేధింపులను నిరూపించాలని అంటున్నారు.

భర్త అనుమతి లేకుండా :

ఇక్జ ఇదే చట్టమలో మరో విషయం ఉంది. భర్త అనుమతి లేకుండా భార్యలు తమ బంధువుల ఇళ్ళను కనుక సందర్శించినట్లు తెలిస్తే ఆ మహిళలకు మూడు నెలల వరకు జైలు శిక్ష విధించవచ్చు అని చట్టం చెబుతోంది. అయితే ఈ చట్టం పట్ల అంతర్జాతీయ సమాజంలో చర్చ సాగుతోంది. మానవ హక్కుల సంఘం అయితే ఐక్య రాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కోరింది. ఐక్య రాజ్య సమితి నిపుణుడు రీమ్ అల్సలేం అయితే ఈ చట్టం మహిళలు బాలికలకు భయంకరమైనదిగా అభివర్ణించారు. మొత్తం మీద తాలిబన్ చట్టం విషయంలో సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ అయితే సాగుతోంది.

Tags:    

Similar News