భారత్, ఆఫ్ఘాన్ మధ్యలో 'రేర్ ఎర్త్ మినరల్స్'.. ఇది గుడ్ న్యూస్!
అవును... ఆధునిక ఆర్థిక వ్యవస్థలోని అనేక కీలక రంగాలను నడిపించే ఏకైక పెద్ద విద్యుత్ వనరుపై చైనా అకస్మాత్తుగా తన పట్టును మరింత కఠినతరం చేసింది.;
కొన్నేళ్ల ప్రతిష్టంభన తర్వాత భారత్ - అఫ్గానిస్థాన్ దేశాల మధ్య స్నేహం చిగురిస్తోంది. భారత్ పర్యటనలో ఉన్న అఫ్గాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ.. శుక్రవారం ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్ తమకు ఫ్రెండ్ అని ఆఫ్ఘాన్ మంత్రి వెల్లడించారు.
ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తంచేసిన ట్రంప్.. ఆ దేశంపై సుంకాల బాంబు పేల్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే చైనాపై 30 శాతం సుంకాలు విధించిన ట్రంప్... అదనంగా 100 శాతం సుంకం విధిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘాన్ నుంచి భారత్ కు గుడ్ న్యూస్ వచ్చింది.
అవును... ఆధునిక ఆర్థిక వ్యవస్థలోని అనేక కీలక రంగాలను నడిపించే ఏకైక పెద్ద విద్యుత్ వనరుపై చైనా అకస్మాత్తుగా తన పట్టును మరింత కఠినతరం చేసింది. ఇందులో భాగంగా... జాతీయ భద్రత, అధునాతన ఆర్మీ అవసరాలపై ఆందోళనలను పేర్కొంటూ.. బీజింగ్ రేర్ ఎర్త్ మినరల్స్, సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాలపై ఎగుమతి ఆంక్షలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో చైనా వెలుపల అరుదైన భూమి సరఫరాల కోసం భారతదేశం చురుగ్గా అన్వేషించడం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా... భారత కంపెనీలు ప్రపంచ భాగస్వాములతో, విదేశాలలో ప్రాసెసింగ్ అగ్రిమెంట్స్ పై నిమగ్నమై ఉన్నాయని వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ ధృవీకరించారు. సరిగ్గా ఈ సమయంలో ఆఫ్ఘాన్ నుంచి అర్దుదైన ఆహ్వానం భారత్ కు అందింది.
ఇందులో భాగంగా... ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా విలువైన అరుదైన మట్టి ఖనిజాల (రేర్ ఎర్త్ మినరల్స్) విషయంలో ఆఫ్ఘాన్.. భారత్ కు వెల్ కం చెప్పింది. ఈ క్రమంలో మినరల్స్, ఎనర్జీ సెక్టార్ లో తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తోంది. దీంతో... ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఇకపై చైనాతో పాటు పలు ఇతరదేశాలపైనా ఆధారపడే అవసరం తగ్గుతుందని అంటున్నారు.
ఇదే సమయంలో... ఖనిజాల సరఫరాపై అమెరికాతో పాకిస్థాన్ ఇటీవల 500 మిలియన్ డాలర్స్ పెట్టుబడి ఒప్పందం చేసుకున్న వేళ... ఆఫ్ఘాన్ ఆఫర్ ను భారత్ వాడుకుంటే అటు అగ్రరాజ్యంతో పాటు, ఇటు చైనాకు ఒకేసారి చెక్ పెట్టినట్లవుతుందని చెబుతున్నారు. కాగా... ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీల తయారీతో పాటు ఆర్మీ అవసరాలకు ఈ ఎర్త్ మినరల్స్ ని ఉపయోగిస్తారు.
ఆఫ్ఘాన్ లో ఉపయోగిచబడని ఖనిజ వనరులు ఎన్నో..!:
ఆఫ్ఘనిస్తాన్ లో ఉపయోగించబడని ఎన్నో ఖనిజ వనరులు ఉన్నాయని గ్లోబల్ ఇనీషియేటివ్ వెల్లడించింది. ఇందులో భాగంగా... ఆఫ్ఘాన్ 2.2 బిలియన్ టన్నుల ఇనుప ఖనిజం, 60 మిలియన్ టన్నుల రాగి, 183 మిలియన్ టన్నుల అల్యూమినియం, లాంతనమ్, సీరియం, నియోడైమియం వంటి రేర్ ఎర్త్ మినరల్స్ కి సంబంధించిన అపారమైన నిల్వలను కలిగి ఉందని తెలిపింది. దీంతో... 2025లో ఆఫ్ఘనిస్తాన్ ఖనిజ వనరుల మొత్తం విలువ అంచనా $3 ట్రిలియన్లను దాటింది!