అమ్మ.. అమ్మే.. 85 ఏళ్ల వయసులో కూతురికి కిడ్నీ ఇచ్చింది
అమ్మంటే అమ్మే. ఆమెను రీప్లేస్ చేయటం ఎవరి తరం కాదు. ఇటీవల కాలంలో వచ్చిన సామాజిక మార్పుల్లో భాగంగా అమ్మతనానికి మచ్చ తెచ్చే కొన్ని ఉదంతాల్ని చూస్తున్నాం;
అమ్మంటే అమ్మే. ఆమెను రీప్లేస్ చేయటం ఎవరి తరం కాదు. ఇటీవల కాలంలో వచ్చిన సామాజిక మార్పుల్లో భాగంగా అమ్మతనానికి మచ్చ తెచ్చే కొన్ని ఉదంతాల్ని చూస్తున్నాం. ఇప్పుడు చెప్పే ఉందతం మాత్రం అమ్మ పాత్రకు మరింత విలువ పెరిగేలా ఉంటుందని చెప్పాలి. 85 ఏళ్ల వయసులో కూమార్తె తీవ్ర ఆనారోగ్యానికి గురైన వేళ.. అమ్మగా ఆమె వెంట ఉంటానని చెప్పటమే కాదు.. ఆరోగ్యంగా ఉన్న తన కిడ్నీని కూమార్తెకు ఇచ్చేసిన వైనం రాజస్థాన్ లోని జైపూర్ లో చోటు చేసుకుంది.
50 ఏళ్ల గుడ్డీకి రెండు కిడ్నీలు పాడయ్యాయి. కొన్ని నెలలుగా డయాలసిస్ చేయించుకుంటున్నా పరిస్థితుల్లో మార్పు లేకపోగా.. ఆమె ఆరోగ్యం మరింతగా దిగజారిన పరిస్థితి. ఇలాంటి వేళ.. కిడ్నీలను మార్చటమే అందుకున్న మెరుగైన ప్రత్యామ్నాయంగా వైద్యులు సూచన చేశారు. దాతల కోసం పెద్ద ఎత్తున అన్వేషించారు. అయినా.. ఆమెకు మ్యాచ్ అయ్యే కిడ్నీలు లభించలేదు.
ఇలాంటి వేళ.. కుమార్తె గుడ్డీని కాపాడేందుకు ఆమె తల్లి ముందుకు వచ్చింది. తన కిడ్నీని కూమార్తెకు అమర్చాల్సిందిగా వైద్యుల్ని కోరింది. 60-65 ఏళ్ల వయసు వారే కిడ్నీని దానం చేసేందుకు భారీ రిస్కుగా భావిస్తారని.. అందుకు భిన్నంగా 85 ఏళ్ల వయసులో కుమార్తె కోసం కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన వైనం వైద్యులను విస్మయానికి గురిచేసింది. ఆమె మనోబలం.. ఆరోగ్య పరిస్థితి.. మానసికంగా సన్నద్ధం కావటం లాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకున్న వైద్యులు.. 85 ఏళ్ల బుధోదేవి కిడ్నీని ఆమె కుమార్తె గుడ్డీకి విజయవంతంగా అమర్చారు.
ఇలాంటి మానవీయ ఉదంతాలు మనుషుల్లో మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కిడ్నీ మార్పిడి తర్వాత బుధో దేవి ఆరోగ్యం నార్మల్ కు రావటంతో.. ఆమెను సైతం డిశ్చార్జ్ చేశారు. 85 ఏళ్ల వయసులో కూతురు కోసం తల్లి పడిన ఆరాటం.. అందుకు ప్రాణం పోయినా ఫర్లేదన్న్టట్లుగా వ్యవహరించిన వైనం అమ్మకు మాత్రమే ఇలాంటి పెద్ద మనసు ఉంటుందని చెప్పకతప్పదు.