• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రూ.4 బిర్యానీ.. ఆఫర్...

రూ.4 బిర్యానీ.. ఆఫర్ తర్వాత నర్సిపట్నంలో ఏమైంది?

| అదరగొట్టే ఆఫర్ రావాలే కానీ.. దాన్ని సొంతం చేసుకోవటానికి ఎంతలా ట్రై చేస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By - Tupaki Desk
Update: 2024-12-16 05:21 GMT

అదరగొట్టే ఆఫర్ రావాలే కానీ.. దాన్ని సొంతం చేసుకోవటానికి ఎంతలా ట్రై చేస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటిదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో చోటు చేసుకుంది. కేవలం నాలుగు రూపాయిలకే చికెన్ బిర్యానీ ఇస్తామని.. అది కూడా కేవలం రెండు గంటలు మాత్రమే అంటూ చేసిన ప్రచారంతో వేలాది మంది పోటెత్తారు. అంతేకాదు.. ఒకరికి ఒక చికెన్ బిర్యానీ మాత్రమే ఇస్తానని ప్రకటించటంతో.. ఆ అద్భుత ఆఫర్ ను సొంతం చేసుకోవటానికి మిగిలిన పనులన్నీ వదిలేసుకొని.. బిర్యానీ సెంటర్ వద్ద గంటల తరబడి నిలిచిన వైనం చూస్తే.. ఔరా అనుకోవాల్సిందే.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ‘అన్ లిమిటెడ్ మల్టీక్యూజెన్ రెస్టారెంట్’ పేరుతో డిసెంబరు 15న ఒక రెస్టారెంట్ ను ప్రారంభించారు. నర్సీపట్నం బస్టాండ్ సమీపంలో స్టార్ట్ చేసిన ఈ రెస్టారెంట్ ను ప్రమోషన్ చేసేందుకు దాని నిర్వాహకులు అదిరే ఆఫర్ ను ప్రకటించారు. రూ.4లకే చికెన్ బిర్యానీ అంటూ పేర్కొంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టారు.




 


రెస్టారెంట్ ఓపెనింగ్ నేపథ్యంలో ఈ అదిరే ఆఫర్ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. అంచనాలకు తగ్గట్లే.. మిగిలిన పనులన్నీ వదిలేసుకొని.. ఉదయాన్నే ఈ రెస్టారెంట్ వద్దకు జనాలు పోటెత్తారు. గంటల ముందే రెస్టారెంట్ వద్దకు చేరుకున్న బిర్యానీ ప్రియులు.. తమ పిల్లల్ని..కుటుంబ సభ్యుల్ని వెంట పెట్టుకురావటం గమనార్హం. రెస్టారెంట్ వైపు వెళుతూ.. ఆఫర్ గురించి తెలుసుకున్న వాహనదారులు సైతం తమ ప్రయాణాన్ని పక్కన పెట్టేసి.. క్యూలైన్ లో చేరిపోయారు.

దీంతో రెస్టారెంట్ చుట్టుపక్కల ప్రాంతాలన్ని జనాలతో నిండాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ హడావుడి గురించి తెలుసుకున్న పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. క్యూలైన్లను ఏర్పాటు చేయటం.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కట్ చేస్తే.. నిర్వాహకులు పేర్కొన్న 2 గంటల వ్యవధిలో ఏకంగా3వేల మందికి తాము చికెన్ బిర్యానీని రూ.నాలుగుకే అందజేసినట్లు చెబుతున్నారు.చికెన్ బిర్యానీనా మజాకానా?

Tags:    
  • Biryani 
  • Narsipatnam 
  • Fourrupees 
  • Andhrapradesh 
  • Queue 
  • Appublic 
  • Chickenbiryani 
  • Biryanioffer 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS