కోవిషీల్డ్‌ బాధితులకు పరిహారం కోసం పిటిషన్... డిమాండ్స్ ఇవే!

ఇదే సమయంలో... వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చనిపోయిన, వైకల్యం చెందినవారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని ఆయన తన పిటిషన్ లో కోరారు.

Update: 2024-05-01 11:29 GMT

తాము తయారుచేసిన కరోనా వైరస్ టీకా కోవిషీల్డ్‌ తో అరుదైన దుష్ప్రభావాలు తలెత్తుతాయని బ్రిటిష్ ఫార్మ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇటీవల అంగీకరించిన సంగతి తెలిసిందే. బ్రిటన్ పత్రిక టెలీగ్రాఫ్ నివేదిక ప్రకారం... కోవిషీల్డ్ వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌ లెట్ కౌంట్ పడిపోవడం వంటి పరిస్థితికి కారణమవుతుందని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ లో ఆస్ట్రాజెనెకా పేర్కొంది. ఈ సమయంలో... భారత సుప్రీంకోర్టులో ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలైంది!

అవును... తమ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌ లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తాయని బ్రిటిష్ – స్వీడిష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా ఇటీవల చేసిన ప్రకటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇదే వ్యాక్సిన్‌ ను భారత్ లో "కొవీషీల్డ్" పేరుతో తయారు చేశారు! దీంతో... ఆస్ట్రాజెనెకా ప్రకటన చాలామంది భారతీయులను ఆందోళనలోకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో భారత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.

Read more!

ఇందులో భాగంగా... కోవీషీల్డ్ సైడ్ ఎఫెక్టులపై వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విశాల్ తివారీ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో... వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చనిపోయిన, వైకల్యం చెందినవారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. ఈ నేపథ్యంలో.. కరోనా వ్యాక్సిన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది!

మరోపక్క.. తమ కరోనా టీకా తీసుకున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది ఆస్ట్రాజెనెకా. ఈ మేరకు... ప్రయోగ పరీక్షల్లో కొవిషీల్డ్ వ్యాక్సిన్ సక్సెస్ రేటు మెరుగ్గా వచ్చిందని, దానికి సంబంధించిన బలమైన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తాజాగా ప్రకటించింది. ఇదే సమయంలో... తమ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్న వారికి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతని చెప్పడం గమనార్హం!

Tags:    

Similar News