• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Health >  చైనాలో కలకలం.. భారత్ లో...

చైనాలో కలకలం.. భారత్ లో కలవరం.. యూఎస్ లో మరణం!

| అవును... గతంలో చైనాలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని అల్లల్లాడించి, లక్షలాది కుటుంబాల్లో తీవ్ర శోకాలు మిగిల్చిన కరోనా వైరస్ సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-01-07 04:13 GMT

నూతన సంవత్సరం ప్రపంచం మొత్తం సరికొత్త ఆశలు, ఆశయాలతో ప్రారంభించినట్లు చెబుతుంటే.. సమస్యలు కూడా అలానే తెరపైకి వస్తున్నాయా అనే చర్చ మొదలైంది. బాబా వాంగ, నోస్ట్రడామస్ ల పేర్లు చెప్పి పలు ఆందోళనలు కలిగించే జోస్యాలు హల్ చల్ చేస్తున్న వేళ.. ఇటు వైరస్ లు వాటి పనుల్లో అవి బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

అవును... గతంలో చైనాలో పుట్టి ప్రపంచం మొత్తాన్ని అల్లల్లాడించి, లక్షలాది కుటుంబాల్లో తీవ్ర శోకాలు మిగిల్చిన కరోనా వైరస్ సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ‘చైనాలో వైరస్’ అనే మాట వింటే చాలు ప్రపంచం వణికిపోతుంది. ఈ సమయంలో తాజాగా ఆ దేశంలో హ్యూమన్ మెటాన్యుమో వైరస్ (హెచ్ఎంపీవీ) కలకలం సృష్టిస్తోన్న వేళ.. ఆ తరహా కేసులో భారత్ లోనూ దర్శనమివ్వడం కలవరం పెడుతోంది.

చైనాలో కలకలం సృష్టిస్తున్నట్లు చెబుతున్న హెచ్ఎంపీవీ కేసులు ఇప్పుడు భారత్ లోనూ వెలుగుచూశాయి. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో సోమవారం నాడు తొలి కేసులు నమోదయ్యాయి. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు గుర్తించగా.. చెన్నైలోనూ ఇద్దరు శిశువులకు.. అహ్మదాబాద్ లో ఒక చిన్నారికీ ఈ వైరస్ సోకింది.

మరోపక్క... ఈ వైరస్ కొత్తదేమీ కాదని.. దీన్ని 2001లోనే గుర్తించారని.. ఈ వైరస్ పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ వైరస్ చాలా ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని.. భారత్ లో పరిస్థితిని ఆరోగ్యశాఖతో పాటు ఐసీఎంఆర్. ఎన్.సీ.డీ.సీ. లు నిశితంగా పరిశీలిస్తున్నాయని అన్నారు.

ఇదే సమయంలో... భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ ఇప్పటికే వ్యాప్తిలో ఉందని.. మిగిలిన శ్వాసకోస వైరస్ ల మాదిరిగానే ఇదీ ఉంటుందని.. దీని విషయంలో ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. దేశంలో తీవ్ర శ్వాసకోశ వ్యాధులు అసాధారణ రీతిలో ఏమీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

తొలి బర్డ్ ఫ్లూ మరణం!:

ఇలా అటు చైనాలోనూ, ఇటు భారత్ లోనూ హెచ్ఎంపీవీ కి సంబంధించిన ఆందోళనలు నెలకొంటున్నాయని అంటున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికాలో తొలి బర్డ్ ఫ్లూ మరణం కలకలం సృష్టిస్తోంది. ఈ మేరకు లూసియానాలో ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) సోకి మరణించినట్లుగా స్థానిక వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా... ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో సుమారు 65 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఆస్పత్రిలో చేరారని.. అడవి పక్షలు, ఫౌల్ట్రీ ఫాం లకు దగ్గరగా వెళ్లడం వల్ల ఆ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని తెలిపారు. ఇదే సమయంలో.. ఈ వైరస్ అతని నుంచి మరో వ్యక్తికి వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని వెల్లడించారు.

ఈ బర్డ్ ఫ్లూనే 'ఏవియన్ ఇన్ ఫ్లుయోంజా వైరస్' గా పిలుస్తారు. ఇది సాధారణంగా పక్షులు, కోళ్లకు వస్తుంది. అయితే... ఇటీవల రాష్ట్రంలో మానవులలో బర్డ్ ఫ్లూ కేసులు పెరగడంతో కాలిఫోర్నియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... గవర్నర్ గావిన్ న్యూసోమ్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు కథనాలొచ్చాయి!

Tags:    
  • USA 
  • Birdflu 
  • People 
  • Louisiana 
  • Birdfludeath 
  • Unitedstates 
  • Hmpvvirus 
  • Hampvcases 
  • Hmpvchinavirus 
  • India 
  • China 

Similar News

Fitness Goals: Building a Strong Body Through Healthy Habits

2026-10-30 11:45 GMT

ప్రపంచంపైకి మరో వైరస్.. అప్రమత్తతే శ్రీరామరక్ష

2026-10-30 05:23 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

2026-10-27 11:22 GMT

పరుగుల జీవితంలో మానసిక కల్లోలం!

2026-10-15 13:12 GMT

హైదరాబాద్‌లో వ్యాపిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా A !

2026-10-13 07:16 GMT

మాన‌వ మెద‌డు ర‌హ‌స్యాల‌ను డీకోడ్ చేసిన సంచ‌ల‌న ప‌రిశోధ‌న‌!

2026-10-10 17:27 GMT

దూరాలు పెరుగుతున్నాయి.. ఒంటరి అవుతున్న మనిషి

2026-10-10 16:58 GMT

రష్యాలో ప్లేగ్ మరణాల కలకలం.. త‌స్స‌దియ్యా అసలు నిజం తెలుసుకోకుండానే!

2026-10-08 07:08 GMT

రష్యాలో మరో మహమ్మారి.. డేంజర్ లో 200 మంది? ప్రపంచానికి భయం

2026-10-05 04:34 GMT

ఈ అలవాట్లు మీకు ఉన్నాయా? అయితే మీకు పిల్లలు పుట్టరు..

2026-10-03 12:44 GMT

న్యూరాలింక్‌తో ఆలోచనలే మాటలయ్యాయి.. మాట కోల్పోయిన వారికి కొత్త ఆశ

2026-09-19 04:53 GMT

Copyright @2026

Powered by Blink CMS