సమోసా తింటే 50 నిమిషాలు నడవాలి
స్నాక్స్ అంటే ఇష్టం లేని వారుండరు! సాయంత్రం వేళ టీతో పాటు వేడి వేడి సమోసా, వడపావ్, లేదా నోరూరించే గులాబ్ జామ్ తినాలనే కోరికను చాలా మంది అదుపు చేసుకోలేరు.;
స్నాక్స్ అంటే ఇష్టం లేని వారుండరు! సాయంత్రం వేళ టీతో పాటు వేడి వేడి సమోసా, వడపావ్, లేదా నోరూరించే గులాబ్ జామ్ తినాలనే కోరికను చాలా మంది అదుపు చేసుకోలేరు. కానీ, ఈ చిన్న చిన్న రుచికరమైన తినుబండారాలు మన ఆరోగ్యంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో చాలా మందికి తెలియదు.
ఈ నేపథ్యంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ మనన్ వరా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రుచిని ఆస్వాదిస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం ఎంత కష్టపడాలో ఆయన చాలా స్పష్టంగా వివరించారు.
* ఒక్క సమోసా, ఎన్నో క్యాలరీలు!
డాక్టర్ మనన్ వరా ప్రకారం, మనం తీసుకునే సాధారణ స్నాక్స్ , స్వీట్లలోని క్యాలరీల వివరాలు.. వాటిని కరిగించడానికి అవసరమైన నడక సమయాన్ని ఆయన ఈ విధంగా వివరించారు
* ఒక సమోసా లేదా వడపావ్:
క్యాలరీలు: సుమారు 250
కరిగించడానికి అవసరమైన నడక: కనీసం 50 నిమిషాలు
ఒక స్లైస్ కేక్:
క్యాలరీలు: 285
కరిగించడానికి అవసరమైన నడక: సుమారు 55 నిమిషాలు
ఒక లడ్డూ లేదా పెద్ద స్వీట్:
క్యాలరీలు: 330
కరిగించడానికి అవసరమైన నడక: ఒక గంటకు పైగా
ఒక గులాబ్ జామ్:
క్యాలరీలు: 180
కరిగించడానికి అవసరమైన నడక: 35 నిమిషాల నడక
ఒక ప్లేట్ చోలే భతురే:
క్యాలరీలు: 600
కరిగించడానికి అవసరమైన నడక: రెండు గంటల సుదీర్ఘ వాక్
* డాక్టర్ వరా నుండి "స్మార్ట్ ఈటింగ్ టిప్"
డాక్టర్ మనన్ వరా ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఆయన ప్రకారం, మీరు మీ ఇష్టమైన ఆహారాలను పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీరు తినే వాటిని తగిన విధంగా బ్యాలెన్స్ చేయడం అనేది తప్పనిసరి. "మీరు ఆహారం తీసుకున్న వెంటనే శరీరానికి అవసరమైన కదలిక ఇవ్వకపోతే, ఆ క్యాలరీలు కొవ్వుగా మారి ముప్పు కలిగిస్తాయి," అని ఆయన హెచ్చరించారు.
ఆయన చెప్పిన ఈ ‘స్మార్ట్ ఈటింగ్ టిప్’ సోషల్ మీడియాలో విపరీతంగా పంచుకోబడుతోంది. చాలా మంది నెటిజన్లు "తింటాం కానీ వాక్ మిస్ అవ్వకూడదు" అంటూ దీనికి స్పందిస్తున్నారు.
రుచిని ఆస్వాదిస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, ‘తినడం – నడవడం’ అనే సూత్రాన్ని మన దినచర్యలో భాగం చేసుకోవడం అత్యవసరం. కాబట్టి, ఇకపై స్నాక్స్ తీసుకునే ముందు, ఆ తర్వాత ఎంత సమయం నడవాలో గుర్తుంచుకోవడం మంచిది!