సంతాన లేమికి మానసిక రుగ్మతలు కూడా ఒక కారణమే!

ప్రస్తుత కాలంలో సంతాన లేమి ఒక ప్రధాన కారణంగా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సంతానం లేని జంటలు పెరుగుతున్నారు

Update: 2023-12-28 16:30 GMT

ప్రస్తుత కాలంలో సంతాన లేమి ఒక ప్రధాన కారణంగా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సంతానం లేని జంటలు పెరుగుతున్నారు. ఫలితంగా ప్రపంచంలో జనాభా పెరుగుదలపై తీవ్ర ప్రభావం పడుతోంది. గతంలో చైనా అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉన్నా ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయింది. మన దేశం జనాభాలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా జనాభా తగ్గడానికి పలు కారణాలు ఉంటున్నాయి. ప్రపంచ దేశాలు జనాభా సమస్యతోనే బాధపడుతున్నాయి.

సంతాన లేమికి మానసిక రుగ్మతలు కూడా ఒక కారణమేనని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. సుమారు 414 వ్యాధులు మానసిక పరివర్తనను ప్రభావితం చేస్తాయని తెలిపింది. ఇందులో 74 వ్యాధులు పిల్లలు లేకుండా చేయడానికి సంబంధం ఉందని గుర్తించారు. 74 రకాల వ్యాధులు మానసిక పరివర్తనకు సంబంధించనవే అని చెప్పడం గమనార్హం.

ఈ రోజుల్లో మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లను మానలేకపోతున్నారు. ఇవి కూడా సంతాన లేమికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. దీంతో కూడా సంతాన భాగ్యం కలగడం లేదు. చాలా జంటలు సంతాన లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రుల చుట్టు తిరుగుతూ మందులు వాడుతున్నా ఫలితం కనిపించడం లేదు. వంధ్యత్వం పెద్ద సమస్యగా పరిణమిస్తోంది.

ప్రస్తుతం మధుమేహం కూడా సంతాన లేమికి మరో కారణంగా నిలుస్తోంది. బీపీ, షుగర్ లు చిన్న వయసులోనే పలకరిస్తున్నాయి. ఫలితంగా మన రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటోంది. సంతానం మీద ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జబ్బుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. సంతానలేమికి ఆటంకంగా నిలుస్తున్నాయని చెప్పక తప్పదు.

ప్రపంచ వ్యాప్తంగా సంతానం కలగని జంటలు పెరుగుతున్నారు. ఇప్పుడు యువత కెరీర్ మీదే ఫోకస్ పెడుతున్నారు. దీని వల్ల సంతానం మీద ఆసక్తి చూపడం లేదు. దీంతోనే సంతానం ఆలస్యం అవుతోంది. ప్రారంభ దశలోనే ప్లాన్ చేయకుండా జీవితంలో స్థిరపడ్డాక సంతానం కందామని అనుకుంటే కుదరదు. ఏ వయసులో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆవయసులోనే జరిగితేనే అందం. అందుకే సంతానం గురించి ఎలాంటి ముందే ప్లాన్ చేసుకుంటే సరి.

Tags:    

Similar News