మామిడి పండ్లు తింటున్నారా ..ఈ జాగ్రత్తలు తప్పనిసరి

పండ్లలో రారాజు మామిడి పండ్లు. అడవికి సింహం ఎలాగో పండ్లలో మామిడిపండు అలాగ.

Update: 2024-05-10 06:46 GMT

పండ్లలో రారాజు మామిడి పండ్లు. అడవికి సింహం ఎలాగో పండ్లలో మామిడిపండు అలాగ. ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ మామిడిపండ్ల కోసం ఎదురు చూస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం తర్వాత పక్కన మామిడిపండు ఉండాల్సిందే. కొందరు పూరితో పాటు మామిడి రసాన్ని కలిపి కూడా తింటారు అంటే దాని క్రేజ్ ఎంతో అర్ధం చేసుకోవచ్చు.

పేరుకు తగినవిధంగా మామిడిపండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాపర్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అయితే మామిడిపండ్లు తిన్న వెంటనే ఎప్పుడు వాటర్‌ తాగవద్దు. ఎండాకాలంలో మామిడి పండు తిన్న తర్వాత చాలామంది వెంటనే వాటర్‌ తాగుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు.

దీని మూలంగా కడుపులో గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు ఏర్పడు తాయి. పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మామిడిపండు తిన్న గంట తరువాతనే మంచి నీటిని తాగాలి. అయితే చాలామందికి ఈ విషయంపై అవగాహన ఉండదు. దీనివల్ల వారు చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. తమ సమస్యలకు కారణం మామిడి పండు అని భావించి తినడం కూడా మానేస్తారు. మామిడి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగక పోవడంతో పాటు మామిడిపండ్లతో పాటు పెరుగు తినకూడదని వైద్యులు చెబుతున్నారు. ఈ రెండూ కలిపి తినడం మూలంగా జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి. సో పై జాగ్రత్తలు పాటిస్తే భేషుగ్గా మీరు మామడిపండ్లు తినడాన్ని ఆస్వాదించవచ్చు.

Tags:    

Similar News