ఒక వ్యక్తి శరీరంలో కొవిడ్ వైరస్ 613 రోజులు ఉందా?

కొవిడ్ 19 ఎంత భయం కలిగించిందో తెలుసు. రెండేళ్లు మనుషులను ఎంత బాధించిందో చూశాం

Update: 2024-04-20 09:30 GMT

కొవిడ్ 19 ఎంత భయం కలిగించిందో తెలుసు. రెండేళ్లు మనుషులను ఎంత బాధించిందో చూశాం. ఎన్నో నిబంధనలు, శానిటైజర్ రాసుకోవడం, ఇంటికే పరిమితం అవుతూ బిక్కుబిక్కుమంటూ గడిపాం. అయినా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాని తాలూకు జ్ణాపకాలు గుర్తుకు వస్తేనే భయం నీడలా వెంటాడుతుంది. దాని ఊసు ఆలోచిస్తేనే భయం కలగడం సహజం.

నెదర్లాండ్స్ కు చెందిన ఓ ముసలి వ్యక్తిలో 613 రోజుల పాటు కొవిడ్ ఇన్ఫెక్షన్ అతడి శరీరంలో ఉన్నట్లు గుర్తించారు. ఒక వ్యక్తి శరీరంలో అత్యధిక రోజులు వైరస్ ఉండటమనేది మామూలు విషయం కాదు. వైరస్ అంత కాలం ఉండటంతో అతడు దాదాపు రెండు సంవత్సరాల పాటు కొవిడ్ తో బాధపడ్డాడు. అతడు చనిపోయే సమయం వరకు వైరస్ సుమారు 50 సార్లు మ్యుటేషన్ అయిందంటే వ్యాధి తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది.

బలమైన రోగ నిరోధక వ్యవస్థ లేని వారి శరీరంలోనే వైరస్ ఎక్కువ కాలం నిలువ ఉంటుందనడానికి ఇదే నిదర్శనం. అతడి బలహీనమైన రోగనిరోధక శక్తి వల్ల అతడిలో అంత కాలం పాటు వైరస్ తిష్ట వేయడం గమనార్హం. చిన్నపిల్లలు, ముసలి వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దానికి వారు గురైనప్పుడు త్వరగా కోలుకోరు. ఇలా రోజుల తరబడి వైరస్ వారి శరీరంలో ఉంటుంది.

మనుషుల శరీరాలు వైరస్ లకు ఆవాసాలుగా చేసుకుంటే ఇబ్బందులే. శరీరంలో కలిగే మార్పులకు వారి శరీరం బాధలకు గురవడం ఖాయం. రెండేళ్లపాటు వైరస్ శరీరంలో ఉంటే ఎంత బాధలకు గురవుతారో అర్థం చేసుకోవచ్చు. దీనికి అతడి శరీరం అల్లాడిపోతుంది. జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణాలు పోవడం ఖాయమే. ఇలాంటి సమయంలో రోగాలు రాకుండా చూసుకోవడమే మార్గం.

కొవిడ్ సమయంలో చాలా మంది ముసలివారు ప్రాణాలు కోల్పోయారు. రోగ నిరోధక శక్తి లేకపోవడంతో పిట్టల్లా రాలిపోయారు. వైరస్ ధాటికి మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అలాంటి వ్యాధి గురించి ఆలోచనలు వస్తేనే ఒళ్లంతా భయం పుడుతుంది. అలాంటివి భవిష్యత్ లో రాకుండా ఉండాలని కోరుకుంటుంటాం. ఆరోగ్యాన్ని కాపాడుకునేందకు ప్రాధాన్యం ఇస్తాం.

Tags:    

Similar News