మీ కోపం మీకు ఎంత ప్రమాదమో తెలుసా ?!

కోపం కారణంగా కడుపులో అల్సర్‌, గ్యాస్ట్రిక్‌ సమస్యలు పెరుగుతాయి. విపరీతమైన కోపం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది.

Update: 2024-04-30 05:43 GMT

తన కోపమే తన శత్రువు

తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ

తన సంతోషమె స్వర్గము

తన ధుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ ! అన్న పద్యం చిన్నప్పుడు అందరం చదువుకున్నాం. అందుకే కోపాన్ని పక్కన పెట్టాలని సుమతీ శతకారుడు ఎప్పుడో చెప్పాడు.

కోపం కారణంగా ఆరోగ్య నష్టంతో పాటు, తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందనీ వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోపంగా ఉన్న సమయంలో మన మెదడులోని రక్తనాళాలు సంకోచించడం కారణంగా చిట్లిపోయే ప్రమాదం ఉంది.

ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుందంటే మీ ఆరోగ్యాన్ని మీరే పాడుచేసుకుంటున్నారని గుర్తుంచుకోవాలి. కోపం కారణంగా కడుపులో అల్సర్‌, గ్యాస్ట్రిక్‌ సమస్యలు పెరుగుతాయి. విపరీతమైన కోపం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది.

అధిక కోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. తలనొప్పి, అధిక రక్తపోటు, నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. బ్రెయిన్‌ స్ట్రోక్‌, పక్షవాతం సంభవించడం , మధుమేహం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆగ్రహాన్ని దిగమింగి శాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి.

Tags:    

Similar News