స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్
ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు కానీ ఈ వ్యాధి కారణం వల్లనే అని నిర్ధారించేందుకు తగిన ఆధారాలు లేవని వైద్య వర్గాలు చెబుతున్నాయి.;
ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు కానీ ఈ వ్యాధి కారణం వల్లనే అని నిర్ధారించేందుకు తగిన ఆధారాలు లేవని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉత్తరాంధ్రా నుంచి రాయలసీమ దాకా స్క్రబ్ టైఫస్ వ్యాధి భయపెడుతోంది. దీని మీద అవగాహన ఏ మేరకు ఉందో తెలియదు కానీ ప్రాణాంతకం అని జనాలు పూర్తి స్థాయిలో కలవరపడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి విషయంలో సీరియస్ గా ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం ఇపుడు మరో అడుగు ముందుకు వేసి స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్‌లో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అదేశించారు.
రాష్ట్రంలో అక్కడే ఎక్కువ :
ఇదిలా ఉండగా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష నిర్వహించి వివరాలు మొత్తం చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఈ వ్యాధి బారిన పడినవారికి అందుతోన్న వైద్య సాయం పైన సైతం బాబు సమీక్షలో అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక వేయి 592 మంది స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారని తెలుస్తోంది. ఇక అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు అయితే కేవలం స్క్రబ్ టైఫస్ వ్యాధి కారణంగానే ప్రాణాలు పోతున్నట్లుగా ఇప్పటికి అయితే ఏ రకమైన నిర్ధారణ ఇప్పటిదాకా కాలేదని అధికారులు అంటున్నారు. అలాగే చనిపోయిన తొమ్మిది కేసుల్లోనూ కాజ్ ఆఫ్ డెత్‌పై పరిశీలన జరిపామని అయినా స్క్రబ్ టైఫస్ వల్లనే చనిపోయారని ఎక్కడా నిర్థారణ కాలేదని అధికారులు అంటున్నారు. ఇక ఇతర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే తొమ్మిది మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
అవగాహనతోనే :
ఇదిలా ఉంటే ప్రజలు స్క్రబ్ టైఫస్ భారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అలాగే వ్యాధి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహిస్తున్నామని అంటున్నరు. ఇక చూస్తే కనుక దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రభావం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాధికి సంబంధించిన కేసులలో చూస్తే ఏపీ 8వ స్థానంలో ఉందని అంటున్నారు. . తమిళనాడు, ఒడిస్సాలలో చెరో ఏడు వేల వంతున కేసులు ఉన్నాయని తెలుస్తోంది. ఇక స్క్రబ్ టైఫస్ విషయంలో ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని తీర్మానించింది. ఈ టాస్క్ ఫోర్స్ క్షేత్రస్థాయి పర్యటన ద్వారా ఇచ్చే నివేదికను అమలు చేయడం ద్వారా స్క్రబ్ టైఫస్ వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక విధంగా ఈ వ్యాధి విషయంలో ప్రభుత్వం నియంత్రించడమే కాకుండా ఎలా వస్తుందో అధ్యయనం చేస్తూ తిరిగి రాకుండా చూసేందుకు సిద్ధం అవుతోంది.