రేటు పెంచనున్న మలయాళ స్టార్ హీరో?
అందులో భాగంగానే అతను తన నెక్ట్స్ మూవీ రెమ్యూనరేషన్ గా గల్ఫ్ ఓవర్సీస్ రైట్స్ తో పాటూ రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.;
ఎల్2: ఎంపురాన్, తుదరమ్ సినిమాలతో మలయాళ బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకున్నారు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్. ఈ రెండు సినిమాల సక్సెస్ తర్వాత మోహన్ లాల్ తన రెమ్యూనరేషన్ ను పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఓ నిర్మాత చెప్పిన మాటల్ని బట్టి ఇది నిజమని తెలుస్తోంది.
మోహన్ లాల్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు అవడంతో పాటూ ఆ సినిమాలు రూ.350 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. ఇప్పటికీ ఆ సినిమాలు థియేటర్లలో బాగా రన్ అవుతున్నాయి. దీంతో మోహన్ లాల్ తన మార్కెట్ విలువను గుర్తించారని ఆ నిర్మాత అంటున్నారు. అందుకే తన తర్వాతి సినిమా కోసం మోహన్ లాల్ రెమ్యూనరేషన్ ను పెంచుతున్నట్టు సమాచారం.
అందులో భాగంగానే అతను తన నెక్ట్స్ మూవీ రెమ్యూనరేషన్ గా గల్ఫ్ ఓవర్సీస్ రైట్స్ తో పాటూ రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మోహన్ లాల్ రీసెంట్ ట్రాక్ రికార్డు చూస్తే ఆయన ఆ రెమ్యూనరేషన్ ను అడగడంలో న్యాయముంది. అతని రీసెంట్ సినిమాలు మలయాళంలోనే ఎక్కువ వసూలు చేసిన టాప్ 5 లిస్ట్ లో నిలిచాయి.
అయితే మోహన్ లాల్ మిగిలిన ఇండస్ట్రీల్లోని హీరోల్లాగా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోరు. దృశ్యం లాంటి సినిమాలకు రూ.5 నుంచి రూ.6 కోట్లు ఛార్జ్ చేసే ఆయన ఎంపురాన్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకే ఆయన రూ.15 కోట్ల వరకు ఛార్జ్ చేస్తారని సదరు నిర్మాత తెలిపారు. ఇప్పుడు మోహన్ లాల్ రూ.20 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవడం పై వస్తున్న వార్తలు నిజమైతే మాత్రం మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుడిగా ఆయన నిలవడం ఖాయం.