అమ్మ కోసం బిగ్‌బాస్ ఆహ్వానానికి 'నో'..!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'వీర్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జరీన్ ఖాన్ పదేళ్ల పాటు వరుస సినిమాలు చేసింది.;
హిందీతో పాటు సౌత్‌లో భాషల్లోనూ బిగ్‌బాస్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. అన్ని భాషల బిగ్‌బాస్ షో లకు కంటెస్టెంట్స్ విషయంలో కొదవ లేదు. సినిమా సెలబ్రిటీలు, సోషల్ మీడియా సెలబ్రిటీలు, బుల్లి తెర స్టార్స్, సింగర్స్, డాన్సర్స్, సామాజిక వేత్తలు... ఇలా అన్ని రంగాలకు చెందిన వారు బిగ్‌బాస్ షో కి ఆహ్వానిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్వాహకులు పారితోషికం విషయంలో కాస్త వెనుక ముందు ఆడుతున్నారు తప్ప పెద్ద స్టార్స్ సైతం బిగ్‌బాస్‌కి వెళ్లి రావాలని కోరుకుంటున్నారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే వచ్చిన బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరిస్తున్నారు. అందులో హీరోయిన్ జరీన్ ఖాన్ సైతం చేరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన 'వీర్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన జరీన్ ఖాన్ పదేళ్ల పాటు వరుస సినిమాలు చేసింది. పలు సినిమాల్లో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడంతో పాటు, ఎన్నో స్టేజ్ షో లు చేసింది. దాంతో జరీన్ ఖాన్‌కి మంచి గుర్తింపు లభించింది. అయితే 2020 నుంచి ఈమె సినిమాల్లో నటించడం మానేసింది. ఇండస్ట్రీ నుంచి చిన్నా చితకా ఆఫర్లు వస్తున్నప్పటికీ జరీన్ ఖాన్ వాటిని పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న జరీన్ ఖాన్‌కి బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ టీం ఆమెను సంప్రదించిన సమయంలో నో చెప్పిందని ప్రముఖ మీడియా సంస్థలు తమ కథనంలో పేర్కొన్నాడు.
తాజాగా జరీన్ ఖాన్ ఆ విషయమై స్పందించింది. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన మాట వాస్తవమే. తనకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం. ఒకటి రెండు సీజన్‌లు మినహా మొత్తం అన్ని సీజన్‌లను నును చూశాను. ఆ షోకు వెళ్లాలనే ఆసక్తి కూడా ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బిగ్ బాస్‌కు వెళ్లలేని పరిస్థితి ఉంది. నేను ఒక్క రోజు జర్నీ చేస్తేనే ఇంట్లో ఉన్న అమ్మకు పది సార్లు ఫోన్ చేసి ఎలా ఉన్నావు? ఆరోగ్యం ఎలా ఉందని పదే పదే అడుగుతూనే ఉంటాను. నాకు ఉండే పది వేల పనులను పక్కన పెట్టి మూడు నెలల పాటు ఒక్క చోట ఉండటం అనేది అసాధ్యం. నాకు అమ్మ బాధ్యత మాత్రమే కాకుండా ఇంకా చాలా పనులు ఉన్నాయని చెప్పుకొచ్చింది.
బిగ్‌బాస్‌కు వెళ్లి కొత్త వారితో ఉండటం కష్టమే. అయితే నేను వారిలో కొందరితో నాకు అనువైన వారితో స్నేహం ఏర్పర్చుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. కానీ అంత మంది కొత్త వారితో అన్ని రోజులు ఒకే చోట ఉండటం అనేది కాస్త ఇబ్బంది కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను చాలా సౌకర్యవంతంగా ఉంటాను. ఆ సౌకర్యంను నేను మిస్ చేసుకోలేను. ప్రస్తుతం ఉన్న కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు రావాలని అనుకోవడం లేదు. ముందు ముందు కూడా నేను బిగ్ బాస్‌లోకి వెళ్లడం అనుమానమే అంది. నటిగా మంచి గుర్తింపు ఉన్న జరీన్ ఖాన్ బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెడితే గ్లామర్ కంటెంట్‌తో పాటు అన్ని రకాల కంటెట్ వస్తుందని షో నిర్వాహకులు భావిస్తున్నారట. కానీ జరీన్ మాత్రం ఒప్పుకోవడం లేదు.