K ర్యాంప్ పాపకి వర్క్ అవుట్ అయినట్టేనా..?

కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ లో హీరోయిన్ గా నటించిన బ్యూటీ యుక్తి తరేజా. చాలామంది ఆమెకు ఇది తొలి తెలుగు సినిమా అనుకున్నారు కానీ యుక్తి ఆల్రెడీ 2023లోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.;

Update: 2025-11-05 06:31 GMT

కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ లో హీరోయిన్ గా నటించిన బ్యూటీ యుక్తి తరేజా. చాలామంది ఆమెకు ఇది తొలి తెలుగు సినిమా అనుకున్నారు కానీ యుక్తి ఆల్రెడీ 2023లోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. యువ హీరో నాగ శౌర్యతో రంగబలి సినిమా తీసిన ఈ అమ్మడు ఆ సినిమాలో ఆకట్టుకుంది. ఐతే సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఆమెను పట్టించుకోలేదు. ఇక కన్నడ మార్కో సినిమాలో హీరోయిన్ గా చేసి సక్సెస్ అందుకుంది అమ్మడు. కె ర్యాంప్ తో కిరణ్ అబ్బవరం తో జత కట్టింది. సినిమాలో అమ్మడి పర్ఫార్మెన్స్, గ్లామర్ అంతా కూడా తెలుగు ఆడియన్స్ కి నచ్చేసింది.

కె ర్యాంప్ తో కమర్షియల్ గా సక్సెస్..

కె ర్యాంప్ తో కమర్షియల్ గా సక్సెస్ అందుకుంది యుక్తి తరేజా. సో అమ్మడికి కచ్చితంగా మంచి ఛాన్స్ వచ్చేస్తాయని చెప్పొచ్చు. కె ర్యాంప్ తర్వాత యుక్తి ఆల్రెడీ కింగ్ జాకీ క్వీన్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో దసరా దీక్షిత్ శెట్టి హీరోగా చేస్తున్నాడు. కె ర్యాంప్ తో ఆడియన్స్ లో ఒక ఐడెంటిటీ తెచ్చుకుంది కాబట్టి యుక్తికి ఇక్కడ మంచి స్కోప్ దొరికినట్టే లెక్క.

ఐతే 2023 తర్వాత సినిమా ఆఫర్లు రాలేదా తనే స్కిప్ చేసిందా తెలియదు కానీ కె ర్యాంప్ లో ఆమెను చూసి తెలుగు తెరకు మరో టాలెంటెడ్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు. సినిమాలు తక్కువ చేస్తున్నా యుక్తి ఫోటో షూట్స్ తో మాత్రం రచ్చ రంబోలా అనిపిస్తుంది. గ్లామర్ షోతో అమ్మడు చేసే ఫోటో షూట్స్ ఐతే సోషల్ మీడియాని షేక్ చేస్తాయి. సినిమాల్లోకి రాకముందు మోడల్ గా చేసిన అనుభవం ఉన్న యుక్తి ఇప్పటికీ కొన్ని యాడ్స్ లో కనిపిస్తుంది.

యుక్తి తరేజా ఫోటో షూట్స్.. సోషల్ మీడియాని షేక్..

కె ర్యాంప్ హిట్ తర్వాత యుక్తి తెలుగు కెరీర్ గాడిన పడుతుందా లేదా అన్నది చూడాలి. కె ర్యాంప్ సక్సెస్ తో కిరణ్ అబ్బవరం అయితే సూపర్ హ్యాపీగా ఉన్నాడు. క తర్వాత దిల్ రూబా షాక్ ఇచ్చినా మళ్లీ కె ర్యాంప్ తో హిట్ అందుకున్నాడు కిరణ్. సో సినిమా హిట్ అయ్యింది కాబట్టి యుక్తి గురించి కూడా డిస్కషన్స్ చేస్తున్నారు. తెలుగులో రెండు సినిమాలు చేసిన యుక్తి అందులో మొదటిది ఆకట్టుకోలేకపోయినా రెండో సినిమా సక్సెస్ అయ్యింది. సో యుక్తికి కచ్చితంగా తెలుగులో మంచి అవకాశాలే వచ్చే స్కోప్ ఉందని చెప్పొచ్చు.

యుక్తి కూడా పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతున్న టాలీవుడ్ లోనే తన ఫ్యూచర్ ని డిసైడ్ అయ్యి మరీ ఇక్కడ సినిమాలు చేయాలని చూస్తుంది. కె ర్యాంప్ తో పాటు కన్నడ సినిమా ఒకటి, తెలుగు సినిమా ఒకటి చేస్తున్న అమ్మడు నెక్స్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ తో సర్ ప్రైజ్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News