తారక్, చరణ్.. మళ్లీ అదే రచ్చ!

పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ మూవీ తర్వాత ఇప్పటి వరకు ఇద్దరూ కూడా సోలోగా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయలేదు

Update: 2024-05-23 07:23 GMT

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ మూవీ తర్వాత ఇప్పటి వరకు ఇద్దరూ కూడా సోలోగా సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయలేదు. రామ్ చరణ్.. చిరంజీవి ఆచార్య సినిమాలో కనిపించినా ఆ మూవీ డిజాస్టర్ గా మిగిలింది.

ప్రస్తుతం తారక్, చరణ్.. తమ అప్ కమింగ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. దేవరతో పాటు వార్-2 షూటింగ్స్ లో పాల్గొంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. త్వరలో ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన మూవీని కూడా స్టార్ట్ చేయనున్నారు. మరోవైపు రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న RC 16 మూవీ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు.

అయితే తారక్ దేవర, చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలు 2024లోనే విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాల నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్స్ రిలీజ్ అయ్యాయి. ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. దేవర మేకర్స్ మే19వ తేదీన విడుదల చేసిన ఫియర్ సాంగ్ తెలుగులో మిక్స్ డ్ టాక్ అందుకుంది. కానీ నార్త్ లో మాత్రం సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. కేవలం మూడు రోజుల్లోనే యూట్యూబ్ లో 16 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

అదే సమయంలో.. రెండు నెలల క్రితం గేమ్ ఛేంజర్ మేకర్స్ రిలీజ్ చేసిన జరగండి సాంగ్ కు హిందీలో రెస్పాన్స్ తక్కువగా ఉంది. ఇప్పటి వరకు 1.7 మిలియన్ల వ్యూసే వచ్చాయి. దీంతో బీటౌన్ లో చరణ్ కన్నా తమ హీరోకే ఎక్కువ క్రేజ్ ఉందని తారక్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయం మరోసారి ప్రూవ్ అయిందని రచ్చ రచ్చ చేస్తున్నారు. కానీ యూట్యూబ్ వ్యూస్ ను కొలమానంగా తీసుకుని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని కొందరంటున్నారు.

Read more!

అయితే నార్త్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. జైలర్, జవాన్, లియో వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఫియర్ సాంగ్ కు అన్ని వ్యూస్ రావడానికి అదే ముఖ్య కారణమని చెప్పాలి. మరోవైపు, జరగండి సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ కియారా ఉన్నా.. తమన్ కు అంత పాపులారిటీ లేదు. దీంతో ఆ పాట అందుకే ఎక్కువగా రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. వ్యూస్ పక్కన పెడితే.. ఈ రెండు సినిమాలు నార్త్ లో ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తాయో చూడాలి.

Tags:    

Similar News