• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యువ దర్శకులే కావాలంటున్న...

యువ దర్శకులే కావాలంటున్న సీనియర్ హీరోలు!

| నిజానికి బాలకృష్ణ ఒక్కరే కాదు, మిగతా టాలీవుడ్ సీనియర్ హీరోలంతా ఇప్పుడు కుర్ర దర్శకులతో పని చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-02-20 09:30 GMT

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్నడూ లేనంత ఫుల్ ఫార్మ్ లో వున్నారు. అఖండతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన బాలయ్య.. వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి విజయాలతో దూసుకుపోతున్నారు. హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన తర్వాత నటసింహం క్రేజీ హీరోగా మారిపోయారు. ఒక్కసారిగా మార్కెట్ పెరిగిపోవడంతో అగ్ర నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాలు చేయటానికి అడ్వాన్సులు ఇస్తున్నారు. బాలయ్య లైనప్ లోకి పలువురు యువ దర్శకులను తీసుకొస్తున్నారు.

బాలకృష్ణ ప్రస్తుతం కొల్లు బాబీ దర్శకత్వంలో NBK109 సినిమాలో నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. దీని తర్వాత చేయబోయే ప్రాజెక్ట్స్ కోసం కొందరు యంగ్ డైరెక్టర్స్ తో చర్చలు జరుపుతున్నారు బాలయ్య.

బాలకృష్ణ కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిపోయిన 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్ చేయనున్నట్లు రెండేళ్ల క్రితమే ప్రకటించారు. 'ఆదిత్య 999 మ్యాక్స్' అనే టైటిల్ తో ప్లాన్ చేయబడిన ఈ సినిమాకు బాలయ్యే స్వయంగా కథ రెడీ చేస్తున్నారు. వీలైతే తన స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించాలని అనుకున్న సీనియర్ స్టార్.. ఇప్పుడు ఓ యువ దర్శకుడి చేతిలో ఆ ప్రాజెక్ట్ ను పెట్టాలని చూస్తున్నారట. దీని కోసం 'శ్యామ్ సింగ రాయ్' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ తో చర్చిస్తున్నారని, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

బాలయ్యతో మూవీ చేయటానికి చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. వీరిద్దరూ గతంలో 'అన్ స్టాపబుల్ విత్ NBK' ప్రోమో కోసం వర్క్ చేశారు. 'హను-మాన్' బ్లాక్ బస్టర్ హిట్టయిన తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి చర్చకు వచ్చింది. 'జై హనుమాన్' ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ క్రేజీ కాంబోలో సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తారనే టాక్ ఉంది. ఇక వెంకటేశ్ మహా లాంటి మరికొందరు యువ దర్శకులు కూడా ఛాన్స్ దొరికితే బాలకృష్ణతో వర్క్ చేయాలని చూస్తున్నారు

నిజానికి బాలకృష్ణ ఒక్కరే కాదు, మిగతా టాలీవుడ్ సీనియర్ హీరోలంతా ఇప్పుడు కుర్ర దర్శకులతో పని చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. రేసులో యువ హీరోలను అందుకోడానికి, న్యూ ఏజ్ డైరెక్టర్స్ కు అవకాశాలు కల్పిస్తున్నారు. సరికొత్త ఐడియాలతో వచ్చే ఔట్సహికులకు, మేకింగ్ లో కొత్తదనం చూపించే యంగ్ ఫిలిం మేకర్స్ కు ఛాన్సులు ఇస్తున్నారు. తమ ఏజ్ కు తగ్గ స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ, క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయటానికి ఎప్పుడూ ముందుండే కింగ్ అక్కినేని నాగార్జున, ఇటీవల 'నా సామిరంగా' సినిమాతో విజయ్ బిన్నీ వంటి కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నెక్స్ట్ మూవీ కోసం ఇప్పుడు నవీన్ అనే తమిళ్ డైరెక్టర్ తో చర్చలు జరుగుతున్నారని టాక్. 'భోళా శంకర్' తో దెబ్బ తిన్న మెగాస్టార్ చిరంజీవి.. 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ సైతం యువ దర్శకుడు శైలేష్ కొలనుతో కలిసి 'సైంధవ్' మూవీ తీశారు. ఈ లిస్టులో ఇప్పుడు బాలయ్య కూడా జాయిన్ అయిపోయారు. పలువురు యంగ్ డైరెక్టర్స్, అప్‌కమింగ్ డైరెక్టర్లతో పాటుగా బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా బాలకృష్ణతో వర్క్ చేయడానికి వేచి చూస్తున్నారు.

Tags:    
  • Nandamuribalakrishna 
  • Nbk109 
  • Bobby 
  • Youngdirectors 
  • Prashantvarma 
  • Aditya369 
  • Aditya999 
  • Rahulsankrityan 

Similar News

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

Copyright @2026

Powered by Blink CMS