అసలే వరుస ప్లాఫులు.. ఇప్పుడు మరొకటి డ్రాప్..

టాలీవుడ్ యంగ్ హీరో.. ఇండస్ట్రీలో ఆయనకంటూ స్పెషల్ క్రేజ్ ఉంది. సెపరేట్ ఫ్యాన్ కూడా బేస్ ఉంది.;

Update: 2025-09-14 18:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరో.. ఇండస్ట్రీలో ఆయనకంటూ స్పెషల్ క్రేజ్ ఉంది. సెపరేట్ ఫ్యాన్ కూడా బేస్ ఉంది. 23 ఏళ్ల క్రితం హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆ హీరో.. డెబ్యూతో సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో ఒక్కసారి పేరు మార్మోగింది. స్టార్ హీరోల సరసన చేరుతారని అంతా అనుకున్నారు. అంతలోనే తొలి ఫ్లాప్ ను మూటగట్టుకున్నారు.

కానీ వెంటనే మరో సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. దీంతో కచ్చితంగా దూసుకుపోతారని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అలా జరగలేదు. కెరీర్ లో డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. మధ్యలో పుంజుకుంటారు.. కమ్ బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నా అస్సలు జరగలేదు. వరుసగా డిజాస్టర్స్ ను మూటగట్టుకుంటూనే ఉన్నారు.

కెరీర్ స్టార్ట్ అయిన పదేళ్లకు మళ్లీ ఓ చిత్రంతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఆ తర్వాత మరో విజయాన్ని కూడా అందుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 సినిమాల్లో నటించారు. కానీ వాటిలో హిట్ గా నిలిచింది ఒకే ఒక్కటి. మరో సినిమా యావరేజ్ గా నిలిచింది. మిగిలినవన్నీ కూడా పోటీపోటీగా ఆడియన్స్ ను నిరాశపరిచాయి.

వాటిలో కొన్ని భారీ డిజాస్టర్స్ గా కూడా నిలిచాయి. కొంతకాలం క్రితం కెరీర్ లో అత్యధిక నష్టాలు తెచ్చిన మూవీగా ఒకటి నిలిచింది. రీసెంట్ గా మరో మూవీతో రాగా.. అది కూడా మిక్స్ డ్ టాక్ అందుకుంది. దీంతో ఆ హీరో మార్కెట్ డౌన్ మరింత పడిపోయింది. ఆయన లైనప్ లో ఉన్న సినిమాలు ఇప్పటికే ఒక్కొక్కటిగా జారిపోతున్నాయి.

సదరు హీరో లైనప్ లో ఒక మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. కానీ రీసెంట్ గా డిజాస్టర్ అందుకోవడంతో ఆ సినిమా చేతులు మారింది. నిర్మాత డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ మరో యంగ్ హీరోను సంప్రదించినట్లు సమాచారం. అదే సమయంలో ఇప్పుడు ఉన్న మరో మూవీ డ్రాప్ అయినట్లు టాక్.

భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇటీవల స్టార్ట్ అయ్యాయి. కానీ నిర్మాతలు ఇప్పుడు ఆ మూవీ తీసేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అందుకే చిత్రాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. అయితే సదరు హీరో ఇప్పుడు మరో ఫ్లాప్ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. మరి ఆ సినిమా ఏమవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News