యంగ్ డైరెక్టర్ల ఎదురు చూపులు - సవాళ్లు!

తొలి చిత్రంతోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన‌ యువ దర్శకులు రెండో సినిమాను ప్రకటించడానికి చాలా సమయం తీసుకుంటున్నారు.

Update: 2026-07-03 03:48 GMT

తొలి చిత్రంతోనే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన‌ యువ దర్శకులు రెండో సినిమాను ప్రకటించడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా సినిమాకు గ్యాప్ లేకుండా పనిచేసే దర్శకులు ఉండేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి మారింది. భారీ విజయం సాధించిన దర్శకులపై అంచనాలు ఆకాశాన్నంట‌డంతో? తదుపరి అడుగు వేయడానికి తీవ్రమైన మథనానికి గురవుతున్నారు. ఈ జాప్యం వెనుక పరిశ్రమ మారుతున్న తీరు .. పెరుగుతున్న బాధ్యతలు క‌నిపిస్తున్నాయి. రెండో సినిమా విషయంలో దర్శకులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు ప్రేక్షకుల అంచనాలు. తొలి సినిమా ఇచ్చిన సక్సెస్‌ను మించి మరేదో కొత్తదనాన్ని అందించాలనే ఒత్తిడి వెంటాడుతోంది.

భారీ బడ్జెట్ సినిమాల విషయంలో నిర్మాతల నుండి వ‌స్తోన్న ఒత్తిడి, పారదర్శకమైన మార్కెట్ లెక్కలు దర్శకులపై అదనపు భారాన్ని మోపు తున్నాయి. చిన్న తప్పు చేసినా? కెరీర్ గ్రాఫ్ పడిపోతుందనే భయం, అందుకే ప్రతి స్క్రిప్టును పదును పెట్టడానికి నెలల తరబడి సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్-ఇండియా అనే మంత్రం ఆకర్షిస్తోంది. తొలి సినిమా తెలుగుకే పరిమితమైనా? యువ దర్శకులందరూ తదుపరి చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ పాన్-ఇండియా అప్పీల్ కోసం స్క్రిప్టును మార్చడం, అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చేలా ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేయడం అంటే మాటలు కాదు.

ఈ క్రమంలో కథాంశాలను భారీగా మార్చడం, స్క్రీన్ ప్లేను మరింత పక్కాగా సిద్ధం చేసుకోవడం కోసం తీసు కుంటున్న జాగ్రత్తలు జాప్యానికి ప్రధాన కారణమవుతున్నాయి. స్టార్ హీరోలతో పనిచేయడం అనేది అగ్ర దర్శకులకే కాదు. యువ దర్శకులకు కూడా సవాలుగా మారింది. స్టార్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని మాస్ ఎలివేషన్ సీన్లను డిజైన్ చేయడంలోనూ ఆ స్థాయికి తగ్గట్టుగా కథను మలచ డంలోనూ ఎంతో కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి భారీ ప్రాజెక్టుల కోసం హీరోల డేట్లు దొరకడం ఒక ఎత్తైతే? ఆ హీరోల అభిమానుల అంచనాలను అందుకోవడం మరో ఎత్తు.

ఈ నేప‌థ్యంలో తొందరపడి యావరేజ్ సినిమా తీసి అబాసు పాలు కావ‌డం కంటే ? సమయం తీసుకుని బ్లాక్ బస్టర్ కొట్టడమే మంచిదని భావిస్తున్నారు. అయితే సుదీర్ఘంగా వేచి చూడటం వల్ల కెరీర్ పరంగా ఇబ్బందులను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేక్షకుల్లో నిరంతరం ఉనికిని చాటుకోవాలి. కానీ అది నాణ్యతతో కూడిన ఫలితమై ఉండాలి. ఇండస్ట్రీలో వస్తున్న పోటీ దృష్ట్యా దర్శకుల మధ్య కూడా బలమైన పోటీ ఉంది.

కొత్త దర్శకులు ఏటా వస్తున్నారు. కాబ‌ట్టి పాత వారి కంటే మరింత క్రియేటివ్‌గా ఉండాలనే ఒత్తిడికి గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో పాత ఫార్ములాలకు భిన్నంగా వెళ్ల‌డం వల్ల సమయం ప‌డుతుంది.

యంగ్ డైరెక్టర్ల జాప్యం ఒక రకంగా సినిమా నాణ్యతను పెంచుతోందన్న‌ది అంతే నిజం. పరిశ్రమలో సక్సెస్ నిలకడగా ఉండాలంటే? ఒకటి రెండు సినిమాలతోనే స‌రిపెట్ట‌కుండా ఒక బ్రాండ్ ని బిల్డ్ చేసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం వారు పడుతోన్న కష్టం, రాబోయే రోజుల్లో తెలుగు సినిమాకు మరిన్ని గొప్ప చిత్రాలను అందిస్తుందని ఆశీంచొచ్చు. సక్సెస్ తో ఒత్తిడి సహజం. కానీ ఆ ఒత్తిడిని అవకాశంగా మార్చుకుని క్వాలిటీతో కూడిన చిత్రాలను అందించడమే ద‌ర్శ‌కుడికి అస‌లైన స‌వాల్.

Tags:    

Similar News