• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చింతకాయల రవి దర్శకుడు.....

చింతకాయల రవి దర్శకుడు.. మళ్ళీ ఇన్నాళ్ళకు!

| తెలుగు ప్రేక్షకులకు చింతకాయల రవి వంటి వినోదాత్మక చిత్రంతో గుర్తుండిపోయిన దర్శకుడు యోగి చాలా కాలం తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

By - Tupaki Desk
Update: 2025-04-06 15:30 GMT

తెలుగు ప్రేక్షకులకు చింతకాయల రవి వంటి వినోదాత్మక చిత్రంతో గుర్తుండిపోయిన దర్శకుడు యోగి చాలా కాలం తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈసారి మాత్రం ఆయన కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాకుండా ఓ కంటెంట్ బేస్డ్ లేడీ ఓరియెంటెడ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు.

సమ్యుక్తా మీనన్ ఇప్పటికే కొన్ని పవర్ఫుల్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి. ‘భీమ్లా నాయక్’ నుంచి ‘సార్’ వరకు ఆమె చేసిన పాత్రలు బాగానే హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా విరుపాక్ష సినిమాలో ఆమె నటనకు మరిన్ని ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు ఆమె యోగి దర్శకత్వంలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి భైరవీ లేదా రాక్షసి అనే టైటిల్‌లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

ఈ చిత్రాన్ని రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాత గతంలో విలక్షణ కథలతో విభిన్నమైన ప్రయోగాలు చేసిన నిర్మాతగా గుర్తింపు పొందారు. ఇప్పుడు సంయుక్తను ఎంచుకోవడం ద్వారా, ఈ ప్రాజెక్టుపై నమ్మకం ఎంత ఉందో అర్థమవుతోంది. మంచి సాంకేతిక బృందంతో సినిమాను నాణ్యతతో తెరకెక్కించాలనే యత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు యోగి గతంలో చాలా కామెడీ టచ్ ఉన్న సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. కానీ ఈసారి ఆయన ఎంచుకున్న కథ మాత్రం డిఫరెంట్ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. సమాజంలో మహిళల సమస్యల నేపథ్యంలో, అంతర్లీనంగా ఒక సోషల్ మెసేజ్ ఉండేలా కథను తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. ఇందులో సంయుక్త పాత్ర పవర్ఫుల్ గా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి త్వరలోనే టైటిల్ విషయంలో అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరగనుండగా, ఈ సినిమాలో సమ్యుక్తకు జోడీగా ఒక యువ హీరో నటిస్తున్నట్లు టాక్. కానీ కథ మాత్రం పూర్తిగా ఆమె పాత్ర చుట్టూ తిరుగుతుందట. మొత్తానికి చాలా కాలం తర్వాత డైరెక్టర్ యోగి మళ్లీ లైన్ లోకి అందులో సంయుక్త లాంటి ప్రతిభావంతమైన నటి ప్రధాన పాత్రలో ఉండటం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మరి సినిమా కంటెంట్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

Tags:    
  • SamyukthaMenon 
  • DirectorYogi 
  • Bhairavi 
  • Rakshasi 
  • LadyOrientedFilm 
  • TollywoodUpdates 
  • WomenCentricCinema 
  • PowerfulRoles 
  • TeluguCinema 
  • SocialMessageFilm 
  • SamyukthaFans 
  • YogiIsBack 
  • NewAgeCinema 
  • ContentDrivenFilm 

Similar News

వైట్ అవుట్‌ఫిట్‌లో హాట్ ట్రీట్ ఇస్తున్న ఆయిషా శర్మ!

2026-11-23 05:46 GMT

పాన్ ఇండియా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫార్ములా ఏంటి? ఎలాంటి సినిమాలు వస్తే హిట్ అవుతున్నాయి...

2026-11-23 05:46 GMT

దేవ‌ర‌కొండ‌ ప్రేమను క‌ళ్ల‌లోనే చూస్తోన్న ర‌ష్మిక‌

2026-11-23 04:56 GMT

శర్వా కెరీర్‌ను మార్చే సినిమానా..

2026-11-23 04:55 GMT

కెరీర్ పోయినా తలవంచకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా!

2026-11-23 04:37 GMT

మాల్దీవుల్లో నేహా శర్మ బర్త్ డే సెలబ్రేషన్స్!

2026-11-23 04:37 GMT

ఔత్సాహిక సినీర‌చ‌యిత‌లు ఈ దిగ్గ‌జాల నుంచి నేర్చుకోవాల్సిన‌వి!

2026-11-23 04:37 GMT

స్టాక్ మార్కెట్లో IPOకి వెళుతున్న అగ్ర నిర్మాణ సంస్థ?

2026-11-23 03:59 GMT

నిర్మాత ఆఫీస్‌కి వేరొక క‌థ విన‌డానికి వెళ్లి అలా లాక్ అయిపోయింద‌ట‌

2026-11-23 03:56 GMT

భోగి వేదిక‌కు కొత్త‌ క‌ళ తెచ్చిన శ‌ర్వానంద్ సిస్ట‌ర్స్

2026-11-23 03:55 GMT

హీరో-ద‌ర్శ‌కుడి పారితోషికాల్ని బ‌డ్జెట్‌లో 25 శాతానికి కుదించాలి!

2026-11-23 02:35 GMT

దేవిశ్రీ ప్రసాద్‌ను చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు.. !

2026-11-23 02:34 GMT

Copyright @2026

Powered by Blink CMS