అమ్మాయిల‌కు అభిమాన చిత్రంగా టాక్సిక్!

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తోన్న‌ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్: ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్-అప్స్`. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Update: 2026-08-23 18:30 GMT

రాకింగ్ స్టార్ యశ్ నటిస్తోన్న‌ మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం `టాక్సిక్: ఎ ఫెయిరీ టెల్ ఫర్ గ్రోన్-అప్స్`. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రంలో మహిళల పాత్రల చిత్రీకరణ .. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో వస్తున్న విమర్శలపై యశ్ తాజాగా స్పందించారు. ఈ సినిమా మహిళా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుందని, థియేటర్లలో అమ్మాయిలు ఈ చిత్రాన్ని చూసి విపరీతంగా ఎంజాయ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. సినిమాలో గ్లామర్ .. వయొలెన్స్ మోతాదు ఎక్కువైందనే విమర్శలు వస్తున్న తరుణంలో యశ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

`టాక్సిక్` కేవలం పురుషాధిక్యత .. యాక్షన్ సీన్లకే పరిమితం కాలేదు. ప్రతి పాత్రకు బలమైన భావోద్వేగం, స్వయంప్రతిపత్తి ఉంటాయని పేర్కొన్నారు. చిత్రంలో నటించిన కియారా అద్వానీ, నయనతార వంటి ప్రముఖ నటీమణుల పాత్రలు ఎంతో శక్తివంతంగా ఉంటాయని.. వాటి ప్రాముఖ్యత సినిమా చూశాక అందరికీ అర్థమవుతుందన్నారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో కలిసి పని చేయడం పట్ల యశ్ హర్షం వ్యక్తం చేశారు. ఒక మహిళా దర్శకురాలు ఇంతటి భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను ఎంతో పరిణతితో తెరకెక్కించారని ప్రశంసించారు.

సినిమాలోని పాత్రలను తీర్చిదిద్దడంలో గీతూ మోహన్‌దాస్ చూపిన ప్రతిభే ప్రాజెక్ట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా కథలోని లోతును, బ్యాలెన్స్‌ను గీతూ అద్భుతంగా హ్యాండిల్ చేశారని తెలిపారు. కియారా అద్వానీ , ఇతర తారాగణం పాత్రల గురించి వస్తున్న ఊహాగానాలకు యశ్ తెరదించారు. సినిమాలో ప్రతీ నటీనటుడికి ప్రాధాన్యత ఉంటుందని ..కథ డిమాండ్ చేసిన మేరకు వారి పాత్రలు ప్రేక్షకులను మెప్పిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు సినిమాలోని పవర్‌ఫుల్ విజువల్స్ .. ఎమోషన్స్‌తో కనెక్ట్ అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో వస్తున్న గ్యాంగ్‌స్టర్ చిత్రాలకు భిన్నంగా `టాక్సిక్` ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. యశ్ చెప్పినట్లుగా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంద‌ని అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. సినిమా విడుదల దగ్గరవుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ఇస్తున్న ఇంటర్వ్యూలు ..అప్‌డేట్‌లు అంచనాలను మరింత పెంచుతున్నాయి. మ‌రి య‌శ్ వ్యాఖ్య‌ల్లో నిజ‌మెంత‌? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత తెలుస్తుంది. సినిమాలో శృంగార స‌న్నివేశాలు అధికంగా ఉన్నాయ‌నే ప్ర‌చారం ఇప్ప‌టికే జోరుగా సాగుతుంది. అవి గ‌నుక శ్రుతి మించితే? విమ‌ర్శ‌లు త‌ప్ప‌వు అన్న‌ది అంతే వాస్త‌వం. `ఏ` స‌ర్టిపికేష‌న్ తో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సెన్సార్ కూడా పెద్ద‌గా క‌ట్స్ విధించ‌లేద‌నే ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది.

Tags:    

Similar News