లీక్స్ తో ఫాన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తున్నారా .. కారణాలు ఏంటి..?
కె.జి.ఎఫ్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ యష్. కె.జి.ఎఫ్ 1 అండ్ 2 సినిమాల్లో తన స్టామినా ప్రూవ్ చేశాయి.;
కె.జి.ఎఫ్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ యష్. కె.జి.ఎఫ్ 1 అండ్ 2 సినిమాల్లో తన స్టామినా ప్రూవ్ చేశాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ మాత్రమే కాదు యష్ యాక్టింగ్ కూడా సినిమాను ఆ రేంజ్ సక్సెస్ అందుకునేలా చేసింది. ఐతే కె.జి.ఎఫ్ లాంటి సూపర్ హిట్ సెన్సేషన్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా టాక్సిక్. ఈ సినిమాను కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ లో గీతు మోహన్ దాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా కె.జి.ఎఫ్ రేంజ్ మూవీగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.
యష్ మాస్ స్టామినా..
యష్ ఈ సినిమాతో మరోసారి తన మాస్ స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు. సినిమా మీద అంచనాలు కూడా బాగున్నాయి. అంతా బాగుంది కానీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మీదే యష్ ఫ్యాన్స్ కాస్త అపనమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమా నుంచి వస్తున్న లీక్స్ అంత పెద్ద కిక్ ఇవ్వట్లేదు. లేటేస్ట్ గా సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ కూడా నటిస్తుందని ఆమెకు వెల్కం చెబుతూ ఒక పోస్టర్ వదిలారు.
అసలు సినిమా కథ అనుకున్నప్పుడు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ లేదని టాక్. ఆల్రెడీ టాక్సిక్ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. వార్ 2 తర్వాత అమ్మడు చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్ అదే. మళ్లీ ఇప్పుడు రుక్మిణి వసంత్ ని రంగంలోకి దించుతున్నారు. రుక్మిణి క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసం ఆమెను తీసుకున్నారా లేదా నిజంగానే సెకండ్ హీరోయిన్ నీడ్ ఉందా అన్నది తెలియాల్సి ఉంది.
స్క్రిప్ట్ పూర్తి కాకుండానే షూట్..
మరోపక్క టాక్సిక్ డైరెక్టర్ రీసెంట్ గా ఒక చిట్ చాట్ లో యష్ టాక్సిక్ స్క్రిప్ట్ పూర్తి కాకుండానే షూట్ చేస్తున్నామని చెప్పి షాక్ ఇచ్చారు. కె.జి.ఎఫ్ రెండు భాగాలు సక్సెస్ తర్వాత యష్ చేస్తున్న సినిమా ఎంత పకడ్బందీ ప్లాన్ తో వెళ్లాలి. అలా కాకుండా సెట్స్ లోకి వెళ్లాక స్క్రిప్ట్ డిస్కషన్ చేస్తున్నారన్న కామెంట్ యష్ ఫ్యాన్స్ ని టెన్షన్ లో పడేస్తుంది.
కె.జి.ఎఫ్ హిట్ అవ్వడం కాదు ఆ తర్వాత వస్తున్న టాక్సిక్ తో యష్ సత్తా చాటాల్సి ఉంటుంది. మరి అలాంటి సినిమాకు గీతు మోహన్ దాస్ స్క్రిప్ట్ విషయంలో చూపిస్తున్న నెగ్లిజెన్స్ సినిమా పై ఇంపాక్ట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఐతే ఆమె అలా అనడానికి రీజన్ ఏంటో తెలియాల్సి ఉంది. యష్ టాక్సిక్ సినిమా కె.జి.ఎఫ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గదని అంటున్నారు. కానీ సినిమా గురించి వస్తున్న ఈ లీక్స్ మాత్రం ఓ పక్క ఫ్యాన్స్ ని కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. మరి గీతు మోహన్ దాస్ సినిమాను ఏం చేస్తుందో చూడాలి.