బోల్డ్ సీన్స్‌పై కియారా యూ టర్న్?
కన్నడ స్టార్ యష్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కలిసి నటిస్తున్న టాక్సిక్ సినిమా తాజాగా సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది.;
కన్నడ స్టార్ యష్ హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కలిసి నటిస్తున్న టాక్సిక్ సినిమా తాజాగా సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ముఖ్యంగా సినిమాలోని బోల్డ్ కంటెంట్, దాని చుట్టూ తిరుగుతున్న గాసిప్‌లు, మరియు హీరోయిన్ కెరీర్‌పై దీని ప్రభావం.. ఇవన్నీ కలిపి ఈ ప్రాజెక్ట్‌ను మరింత హాట్ టాపిక్‌గా మార్చాయి. రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ సినిమాల్లో బోల్డ్ కంటెంట్ పెరుగుతుందనేది స్పష్టమైన ట్రెండ్. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావం, గ్లోబల్ కంటెంట్ ఎక్స్‌పోజర్ కారణంగా డైరెక్టర్లు మరింత రియలిస్టిక్, ఎమోషనల్ మరియు బోల్డ్ ట్రీట్‌మెంట్ వైపు మళ్లుతున్నారు. అయితే ఈ విషయంలో ఆడియన్స్ యాక్సెప్టెన్స్ మాత్రం ఇంకా మిక్డ్స్ గానే కనిపిస్తోంది. అర్బన్ ఆడియన్స్ ఈ మార్పులను స్వాగతిస్తున్నా, ఫ్యామిలీ ఆడియన్స్‌లో మాత్రం ఇంకా కొంత రిజర్వేషన్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టాక్సిక్ లాంటి బోల్డ్ యాక్షన్ డ్రామా ఎంతవరకు కనెక్ట్ అవుతుందో అనేది ఆసక్తికర ప్రశ్నగా మారింది.
ఇదే సమయంలో, కియారా అద్వానీ కెరీర్ లో ఈ సినిమా కీలక మలుపుగా భావించవచ్చు. ఇప్పటి వరకు గ్లామరస్, రొమాంటిక్, కమర్షియల్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఈసారి మరింత బోల్డ్, ఇంటెన్స్ పాత్రను ఎంచుకోవడం ఒక రిస్కీ స్టెప్‌గా కనిపిస్తోంది. ఇది ఆమెను కొత్త రేంజ్‌కి తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ, అదే సమయంలో ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశాన్ని కూడా విస్మరించలేం. ముఖ్యంగా సీన్ లెంగ్త్ లేదా ప్రెజెంటేషన్‌పై వచ్చిన తాజా గాసిప్‌లు, ఆమె కెరీర్ స్ట్రాటజీపై కొత్త చర్చలకు దారితీశాయి.
ఈ సినిమాలో తాను నటించిన బోల్డ్ సీన్స్ ను ట్రిమ్ చేయాలని కృతి మేకర్స్ ను కోరినట్టు తెలుస్తోంది. షూటింగ్ టైమ్ లో ఈ సీన్స్ తన అనుమతితోనే జరిగినప్పటికీ, ఇప్పుడు ఫైనల్ అవుట్‌పుట్ చూశాక కృతికి ఇబ్బందిగా అనిపించి, తన డెసిషన్ ను మార్చుకున్నారని, అందుకే ఆ సీన్స్ ను సినిమాలో నుంచి తొలగించాలని డైరెక్టర్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. సాధారణంగా సినిమా షూట్ సమయంలో నటీనటులకు స్క్రిప్ట్, సీన్ బ్లాకింగ్, కెమెరా ట్రీట్‌మెంట్ గురించి ముందుగానే అవగాహన ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ లేదా ఇంటిమేట్ సీన్స్ విషయంలో డైరెక్టర్, నటీనటుల మధ్య క్లియర్ కమ్యూనికేషన్ ఉంటుంది. అయితే, ఫైనల్ ఎడిట్‌లో సీన్ ఎలా కనిపిస్తుందో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్ టెంపో, విజువల్ టోన్.. ఇవన్నీ కలిపి పూర్తిగా భిన్నంగా అనిపించే అవకాశముంది. ఈ కారణంగా కొన్ని సందర్భాల్లో నటీనటులు తమ కంఫర్ట్ జోన్‌ను మళ్లీ రీవాల్యుయేట్ చేయాలనుకుంటారు. ఇదేమీ కొత్త విషయం కాదు.
అయితే ఒకసారి సీన్ షూటింగ్ అయిపోయాక, ఒప్పందం ప్రకారం ఫుటేజ్ ప్రొడక్షన్ హౌస్‌కు వెళ్ళిన తర్వాత, ఫైనల్ కట్‌పై పూర్తి నియంత్రణ దర్శకనిర్మాతలకే ఉంటుంది. అయితే, స్టార్ నటీనటులకు ఒక స్థాయిలో క్రియేటివ్ ఇన్‌పుట్ ఉండటం కూడా సాధారణమే. ముఖ్యంగా తమ ఇమేజ్, పబ్లిక్ పర్సెప్షన్‌కు సంబంధించిన అంశాల్లో వారు అభిప్రాయం చెప్పడం అసాధారణం కాదు. కానీ ఆ అభిప్రాయం ఎంతవరకు అమలు అవుతుందనేది పూర్తిగా మేకర్స్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. బాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కియారా షూట్ టైమ్ లో కంఫర్ట్‌గా ఫీల్ అయినా, ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత కొన్ని సీన్స్ ప్రెజెంటేషన్‌పై డౌట్స్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ గాసిప్ మొత్తం సినిమాపై హైప్‌ను గణనీయంగా పెంచింది. నెగెటివ్ లేదా కాంట్రవర్సీ టోన్‌లో వచ్చినప్పటికీ, ఈ డిస్కషన్స్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. అసలు ఆ ఇంటిమేట్ సీన్ ఎలా ఉంటుంది?, ఫైనల్ కట్‌లో మార్పులుంటాయా? అని నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఇలాంటి నెగెటివ్ పబ్లిసిటీ కూడా కొన్నిసార్లు సినిమాకు ప్లస్‌గా మారిన సందర్భాలున్నాయి. రిలీజ్‌కు ముందే ఇంతటి హైప్ తెచ్చుకున్న ఈ సినిమా, రిలీజ్ తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే వీలుంది.