అనిరుధ్ పై అనుమానాలు..!
కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో శాండల్ వుడ్ స్టార్ హీరో యష్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే.;
కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో శాండల్ వుడ్ స్టార్ హీరో యష్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా మారారు. వరుస షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా పలు ప్రాజెక్టులకు కూడా యష్ వ్యవహరిస్తున్నారు.
రీసెంట్ గా బాలీవుడ్ రామాయణ్ లో ఆయన రావణుడిగా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఆ సమయంలో రిలీజ్ చేసిన గ్లింప్స్ లో యష్ లుక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అదే సమయంలో ఇప్పుడు ఆయన పాన్ ఇండియా మూవీ టాక్సిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది చిత్రం.
మాఫియా కమ్ గ్యాంగ్ స్టర్ జోనర్ లో రూపొందుతున్న టాక్సిక్ సినిమాకు గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యష్ మెయిన్ రోల్ లో చేస్తున్న మూవీ కావడంతో ఆడియన్స్ తో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు.
అదే సమయంలో ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. టాక్సిక్ మూవీకి గాను వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారట. ముందు రవి బస్రూర్ అని టాక్ వచ్చినా అనిరుధ్ నే ఫిక్స్ చేశారని సమాచారం.
మ్యూజిక్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎప్పుడూ ఉర్రూతలూగించే అనిరుధ్ రవిచందర్ వర్క్.. ఇప్పుడు టాక్సిక్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనుందని అంతా భావిస్తున్నారు. అదే సమయంలో నెట్టింట మరో డిస్కషన్ కూడా జరుగుతోంది. టాక్సిక్ మూవీతోనే ఇప్పుడు శాండిల్ వుడ్ లోకి అనిరుధ్ రవిచందర్ అడుగుపెడుతున్నారు.
అయితే ఇతర భాషల్లో అనిరుధ్ తెరంగేట్రం చేసిన సినిమాలు డిజాస్టర్స్ గా మారాయి. కోలీవుడ్ ఫస్ట్ మూవీ 3, బాలీవుడ్ లో జెర్సీ, టాలీవుడ్ లో అజ్ఞాతవాసి.. ఈ మూడు సినిమాలు నిరాశపరిచాయి. కాబట్టి ఆ నెగిటివ్ సెంటిమెంట్ ను ఇప్పుడు అనిరుధ్ బ్రేక్ చేయాలని అంతా కోరుకుంటున్నారు. మరి ఈ సారి అనిరుధ్ ఏం చేస్తారో వేచి చూడాలి.