ప్రయోగానికి సిద్ధమైన కెజిఎఫ్ స్టార్?
అప్పటివరకు కన్నడ చిత్ర పరిశ్రమకే పరిచయమైన యష్, కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు.;
అప్పటివరకు కన్నడ చిత్ర పరిశ్రమకే పరిచయమైన యష్, కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాలతో దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. కెజిఎఫ్ సినిమా ముందు వరకు యష్ గా పేరొందిన అతను, ఆ సినిమా తర్వాత రాకింగ్ స్టార్ గా ఎదిగారు. ఆ సినిమాలతో పెరిగిన క్రేజ్ ను యష్ చాలా జాగ్రత్తగా వాడుకుంటూ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు.
భారీ ప్రాజెక్టులతో బిజీబిజీగా..
అందులో భాగంగానే ప్రస్తుతం యష్ రెండు భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే సినిమాతో పాటూ నితీష్ తివారి దర్శకత్వంలో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణ సినిమాలో నటిస్తున్నారు యష్. ఈ రెండు సినిమాలూ పాన్ ఇంటర్నేషన్ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. టాక్సిక్ వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుండగా, రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ 2026 దీపావళికి, 2027 దీపావళికి రిలీజ్ కానున్నాయి.
పీఎస్ మిత్రన్ తో యష్ మూవీ
ఈ రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న యష్, ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ తో కలిసి సినిమా చేయడానికి యష్ డిస్కషన్స్ చేస్తున్నారని గతంలోనే వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, యష్ కోసం మిత్రన్ ఓ ప్రయోగాత్మక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.
నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లో మొదలయ్యే అవకాశాలు
అనుకున్నది అనుకున్నట్టు జరిగితే యష్- మిత్రన్ కాంబినేషన్ లో సినిమా నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్ లోనే మొదలయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ సినిమాపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అనౌన్స్‌మెంట్ వచ్చే వీలుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత యష్, ప్రశాంత్ నీల్ తో కలిసి కెజిఎఫ్3 చేసే ఛాన్సుంది.