పాన్ ఇండియా స్టార్ తల్లి చేతుల మీదుగా ఘాటీ రిలీజ్.. ఎప్పుడంటే?
కానీ అనవసరంగా ఈమె భాగమతి, నిశ్శబ్దం, సైజ్ జీరో లాంటి చిత్రాలు చేసి కెరియర్ ను స్పాయిల్ చేసుకుందనే వార్తలు కూడా వినిపించాయి.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసింది అనుష్క శెట్టి. 'సూపర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి, భారీ ఇమేజ్ అందుకుంది. 'బాహుబలి' చిత్రంలో నటించిన తర్వాత ఈమె ఇమేజ్ మరింత పెరిగిపోయింది.. దాంతో వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అనవసరంగా ఈమె భాగమతి, నిశ్శబ్దం, సైజ్ జీరో లాంటి చిత్రాలు చేసి కెరియర్ ను స్పాయిల్ చేసుకుందనే వార్తలు కూడా వినిపించాయి.
ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైన అనుష్క మళ్ళీ నవీన్ పోలిశెట్టితో కలిసి 'మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా చేసి పర్వాలేదు అనిపించుకుంది. మళ్లీ ఇప్పుడు కొన్నాళ్ల గ్యాప్ తో ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీ సినిమా చేస్తోంది. నిజానికి ఈ సినిమా జూలై 4వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే కేజిఎఫ్ సినిమాతో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు కన్నడ నటుడు యష్. ఈయన తల్లి పుష్ప అరుణ్ కుమార్ ఈ సినిమాతో పంపిణీ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. పీఏ ఫిలిమ్స్ ద్వారా కర్ణాటకలో ఈ మూవీని ఆమె విడుదల చేయనున్నారు. యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ అనుష్క శెట్టి కి వీరాభిమాని. ఈ హీరోయిన్ సెంట్రిక్ సినిమా ప్రమోషనల్ మెటీరియల్ కూడా ఆమెకు బాగా నచ్చింది. ఈ నేపథ్యంలోనే అనుష్క శెట్టి ఘాటీ మూవీని తాను విడుదల చేస్తానని ఆ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొత్తానికైతే యష్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ కర్ణాటకలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా అక్కడ ఆమెకు ఎలాంటి కలెక్షన్స్ అందిస్తుందో చూడాలి..
దీనికి తోడు ఘాట్ సెక్షన్లలో రవాణా దారులుగా ఉపయోగించబడే ఘాటీల కథ చెప్పే ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాలో అనుష్క శెట్టి ఇంతకుముందు ఎన్నడూ చూడని ఒక శక్తివంతమైన పాత్రలో కనిపిస్తోంది. దీనికి తోడు పాన్ ఇండియా స్టార్ కుటుంబం మద్దతుతో ఈ సినిమా మరిన్ని శిఖరాలు చేరుకుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా నుండి మేకర్స్ రెండు పాటలను, ట్రైలర్ ను విడుదల చేయగా ఇవి సినిమాపై అంచనాలు పెంచేశాయి. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు అంచనాలను అందుకుంటోంది. మరి సెప్టెంబర్ 5వ తేదీన పలు చిత్రాలకు పోటీగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.