బాలయ్య బాక్సాఫీస్ వేట.. 'చిరు' రికార్డు బ్రేక్ అయ్యేనా?

నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ లెక్కలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. సీనియర్ హీరోలైనప్పటికీ, ఓపెనింగ్స్ విషయంలో ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.;

Update: 2025-12-01 22:30 GMT

నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ లెక్కలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. సీనియర్ హీరోలైనప్పటికీ, ఓపెనింగ్స్ విషయంలో ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సీనియర్ హీరోల డే 1 షేర్స్ ఏపీ, తెలంగాణ లిస్ట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో 'సైరా నరసింహారెడ్డి' 38.75 కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాత ఆచార్య (29.50 కోట్లు), డాకు మహారాజ్ (25.72 కోట్లు), వీరసింహారెడ్డి (25.35 కోట్లు) ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ లెక్కలన్నింటినీ మార్చేసే సత్తా 'అఖండ 2'కు ఉందని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

సాధారణంగానే బాలయ్య సినిమా అంటే ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అందులోనూ ఇండస్ట్రీని షేక్ చేసిన 'అఖండ'కు సీక్వెల్ కావడంతో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న రికార్డులను గమనిస్తే, బాలయ్య గత చిత్రాలు 25 కోట్ల మార్క్ దగ్గర స్థిరపడ్డాయి. కానీ ఈసారి పరిస్థితి వేరు. డిసెంబర్ 4న భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్న పెయిడ్ ప్రీమియర్స్, టికెట్ రేట్ల పెంపు కలుపుకుంటే.. అఖండ 2 మొదటి రోజే 30 కోట్ల షేర్ మార్కును దాటడం చాలా సులభం అనిపిస్తోంది.

ఈ సినిమాకు సోలో రిలీజ్ దొరకడం అతిపెద్ద అడ్వాంటేజ్. సంక్రాంతి వరకు వేరే పెద్ద సినిమా లేదు కాబట్టి, దాదాపు అన్ని థియేటర్లలో అఖండ 2 సందడే ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ జనాలు ఎగబడి చూసే అవకాశం ఉంది. కాబట్టి 35 కోట్ల షేర్ రాబట్టడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఒకవేళ టాక్ ఏమాత్రం పాజిటివ్ గా వచ్చినా, చిరంజీవి 'సైరా' నెలకొల్పిన 38.75 కోట్ల రికార్డును బాలయ్య బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇది కేవలం సినిమా కాదు, మాస్ ఆడియన్స్ కు ఒక ఎమోషన్. శివుడి సెంటిమెంట్, అఘోరా గెటప్ మీద ఉన్న నమ్మకం ఓపెనింగ్స్ రూపంలో కాసుల వర్షం కురిపించడం ఖాయం. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఏపీ తెలంగాణలో కలిపి మొదటి రోజు 35 నుంచి 40 కోట్ల మధ్యలో షేర్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే సీనియర్ హీరోల లిస్ట్ లో బాలయ్య సరికొత్త చరిత్ర సృష్టించినట్లే.

మొత్తానికి 'అఖండ 2' బాక్సాఫీస్ దగ్గర ఒక తుఫానులా మారబోతోంది. పాత రికార్డులు పక్కన పెడితే, బాలయ్య తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. డిసెంబర్ 5న ఆ నంబర్స్ చూసి ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అసలు నెంబర్ ఎంత ఉంటుందో చూడాలి.

ఏపీ తెలంగాణలో బాలకృష్ణ, చిరంజీవి టాప్ ఓపెనింగ్స్

సై రా: 38.75cr

ఆచార్య: 29.50cr

డాకు మహారాజ్: 25.72cr

వీరసింహారెడ్డి: 25.35cr

ఖైదీ నెంబర్ 150: 23.35cr

Tags:    

Similar News