VD14: ఆ పొగమంచు వెనుక ఏదో జరుగుతోంది

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా కాలంగా సైలెంట్ గా ఉన్నారు. తమ హీరో సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.;

Update: 2025-12-04 17:48 GMT

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా కాలంగా సైలెంట్ గా ఉన్నారు. తమ హీరో సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ నిశబ్దాన్ని బద్దలు కొడుతూ దర్శకుడు రాహుల్ సంకృత్యాయన్ ఒక క్రేజీ పోస్ట్ పెట్టారు. చాలా రోజుల తర్వాత వచ్చిన ఈ చిన్న హింట్ ఇప్పుడు రౌడీ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

"క్రేజీ.. మ్యాడ్.. వైల్డ్.. వైడ్" అంటూ రాహుల్ వాడిన పదాలు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో చెప్పకనే చెబుతున్నాయి. కేవలం షూటింగ్ అప్డేట్ అని చెప్పకుండా, ఆ పదాలతో సినిమా ఇంటెన్సిటీని బయటపెట్టారు. ఒక భారీ షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఈ పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. దర్శకుడి కాన్ఫిడెంట్ చూస్తుంటే అవుట్ పుట్ గట్టిగానే వచ్చినట్లుంది.

దర్శకుడు షేర్ చేసిన ఫోటోలో దట్టమైన పొగమంచు, ఇసుక తిన్నెలు, పాతకాలపు పడవలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది చూస్తుంటే సినిమా నేపథ్యం ఎంత రస్టిక్ గా, రా గా ఉండబోతోందో అర్థమవుతోంది. పీరియాడిక్ డ్రామా అని ముందు నుంచి వినిపిస్తున్న మాటలకు ఈ ఫోటో బలం చేకూరుస్తోంది. ఆ లొకేషన్ లో జరిగిన యాక్షన్ ఎపిసోడ్స్ వెండితెరపై విజువల్ ఫీస్ట్ లా ఉంటాయనిపిస్తోంది.

గతంలో విడుదలైన పోస్టర్ లో విజయ్ ని ఒక యోధుడిలా చూపించారు. ఇప్పుడు పూర్తి చేసిన ఈ "వైల్డ్" షెడ్యూల్ ఆ వార్ సీక్వెన్స్ లకు సంబంధించినదే అయి ఉండొచ్చు. విజయ్ ఈ సినిమా కోసం ఫిజికల్ గా చాలా కష్టపడుతున్నారు. రాహుల్ విజన్ కు తగ్గట్లుగా తనను తాను మలుచుకుంటున్నారు. కథ డిమాండ్ మేరకే ఇలాంటి లొకేషన్స్ ఎంచుకున్నారని స్పష్టమవుతోంది.

'టాక్సీవాలా' తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కానీ ఇది ఆ జోనర్ కాదు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. పీరియాడిక్ కథ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్, సెట్స్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. అందుకే అప్డేట్స్ ఆలస్యం అవుతున్నాయి. కానీ క్వాలిటీ విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది.

ఈ లేటెస్ట్ అప్డేట్ తో సినిమా ప్రోగ్రెస్ మీద ఒక క్లారిటీ వచ్చింది. 2026 సమ్మర్ టార్గెట్ గా ఈ సినిమా రాబోతోంది. గెట్ రెడీ అని దర్శకుడు ఇచ్చిన హింట్ చూస్తుంటే, త్వరలోనే ఏదో ఒక టీజర్ లేదా గ్లింప్స్ తో రౌడీ ఫ్యాన్స్ కు అసలైన ట్రీట్ ఇవ్వబోతున్నారని అర్థమవుతోంది.

Tags:    

Similar News