త్రివిక్రమ్ హీరోల క్యారక్టరైజేషన్ ను అలా డిజైన్ చేయడానికి కారణం...
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రియేట్ చేసిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రచయితగా పదునైన సంభాషణలతో సత్తా చాటుకుంటూనే, దర్శకుడిగా మేకింగ్ లో తనదైన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రియేట్ చేసిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రచయితగా పదునైన సంభాషణలతో సత్తా చాటుకుంటూనే, దర్శకుడిగా మేకింగ్ లో తనదైన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఎలాంటి సన్నివేశాన్నైనా సరే ప్రేక్షకుడికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో త్రివిక్రమ్ సిద్ధహస్తుడు...
హీరో మెంటాలిటీ & ఇంటిలిజెన్స్
మిగతా దర్శకులతో పోలిస్తే త్రివిక్రమ్ సినిమాల్లోని హీరోల క్యారెక్టరైజేషన్ సగటు మిడిల్ క్లాస్ మెంటాలిటీకి దగ్గరగా ఉంటుంది. కుటుంబ భారాన్నంతా మోసే హీరో, తనకి అనుకోకుండా వచ్చే ఆపదలను తన తెలివి తేటలతో ఎలా ఎదుర్కొన్నాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనే పాయింట్ ను ఆయన ప్రధానంగా హైలెట్ చేస్తారు. దీనివల్ల సినిమా ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. స్క్రీన్ మీద హీరో చేసే పనుల్లో ప్రతి ఆడియన్ తనను తాను ఊహించుకోవడం వల్ల ఈ పాత్రలు జనాల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి... హీరో ఆపద వచ్చినప్పుడు భయపడకుండా, తన ఇంటలిజెన్స్ తో బయటపడే తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది...
కుటుంబ బంధాలు, బంధుత్వాలు
'జులాయి' సినిమాను గమనిస్తే కథానాయకుడు తన ఫ్యామిలీ ని కాపాడుకుంటూనే బ్యాంక్ దొంగతనానికి పాల్పడిన క్రిమినల్స్ ను పట్టించడానికి ప్రయత్నిస్తాడు. ఒకవైపు సమాజం పట్ల ఒక బాధ్యతను నిర్వర్తిస్తూనే తన ఫ్యామిలీ ఎమోషన్స్ కు కట్టుబడి ఉంటాడు. దానివల్ల ప్రేక్షకుడు హీరో చూపించే సోషల్ రెస్పాన్స్బిలిటీస్ కి, బంధాలకు ఇచ్చే గౌరవానికి మంత్రముగ్ధుడవుతాడు. 'అరవింద సమేత' లో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నప్పటికీ హింసను వీడి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలనే కథానాయకుడి ఆలోచనలు సగటు మనిషి మనస్తత్వానికి అద్దం పడుతాయి.
మిడిల్ క్లాస్ మెంటాలిటి
హీరో అందరు బాగుండాలని చెబుతూనే, మిడిల్ క్లాస్ మెంటాలిటీకి చాలా దగ్గరగా ఉండేలా క్యారెక్టర్ ను రాసుకుంటాడు. 'అలా వైకుంఠపురంలో' చిత్రంలో సగటు మధ్యతరగతి కుర్రాడు ఎదుర్కొనే ఇబ్బందులను చాలా సహజంగా చూపించారు. తన క్యారెక్టరైజేషన్ ను పర్ఫెక్ట్ గా రాసుకొని స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడు... అలా హీరో దగ్గర డబ్బులు లేక ప్రతి విషయానికి కాంప్రమైజ్ అయితే ఆ పాత్ర చాలా నాచురల్ గా ఉంటూనే ఆడియన్స్ ఓన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. త్రివిక్రమ్ తన రైటింగ్ లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక అమ్మాయిని లవ్ చేయడం కోసం ఎలాంటి బాధలు పడతారో చాలా క్లియర్ గా చూపిస్తూ ఉంటాడు. దానివల్ల సినిమాలోని సన్నివేశాలు ఒక ఫ్లో లో వెళుతుంటాయి. అందుకే త్రివిక్రమ్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. యూత్ ని సైతం అట్రాక్ట్ చేసే విధంగా ఆయన సినిమాలో కొన్ని లవ్, యాక్షన్ సన్నివేశాలను మిళితం చేసి కథ చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు...