డార్లింగ్‌తో సమంతకు ఎందుకు కుదరలేదు?
అయితే ఇంచుమించి ప్రభాస్ అంత ఎత్తు ఉండే మహేష్ సరసన నటించగలిగినప్పుడు ప్రభాస్ తోనే సమంతకు ఎందుకు కుదరలేదు? అనే సందేహం రావొచ్చు.;
టాలీవుడ్ అగ్ర కథానాయికగా ఎదిగిన సమంత .. మహేష్, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని, నాగచైతన్య లాంటి టాప్ హీరోల సరసన నటించిన సంగతి తెలిసిందే. అటు కోలీవుడ్ స్టార్లు సూర్య, విజయ్, విక్రమ్, కార్తీ, శివ కార్తికేయన్, విశాల్ లాంటి టాప్ స్టార్ల సరసన నటించింది.
అయితే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన ఎందుకు నటించలేదు? ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం... ఆ ఇద్దరి మధ్యా హైట్ పెద్ద అడ్డంకిగా మారిందని పలువురు విశ్లేషిస్తున్నారు. సమంత కంటే ప్రభాస్ 10 ఇంచీల ఎత్తు ఎక్కువ. దీనివల్ల ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో బంధించడానికి ఛాయాగ్రాహకుడు ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. పెద్ద తెర కోసం పెయిర్ ఎంపిక ఎప్పుడూ అంత సులువేమీ కాదు అంటూ కొన్ని హిందీ వెబ్ సైట్లు కథనాలు వేయడం విశేషం. అయినా నాయకా నాయికల ఎంపిక విషయంలో ఆ ఇద్దరి ఒడ్డు పొడుగు కుదరాలి. చాలా విషయాల్లో సింక్ కుదరాలి. అప్పుడే ఆడియెన్ తన్మయంలోకి వెళతాడు. కానీ కొన్ని అడ్డంకులు ఆ ఇద్దరి కలయికకు సమస్యగా మారాయి.
అయితే ఇంచుమించి ప్రభాస్ అంత ఎత్తు ఉండే మహేష్ సరసన నటించగలిగినప్పుడు ప్రభాస్ తోనే సమంతకు ఎందుకు కుదరలేదు? అనే సందేహం రావొచ్చు. ఇది పూర్తిగా సమంత ఎంపిక. ప్రభాస్ సరసన నటించేందుకు ఆప్షన్ ఉన్నా కానీ, అప్పటికి తన కెరీర్ జర్నీకి సంబంధించిన ఎంపికలు అలా ముగిసిపోయాయి.
ప్రభాస్ తన ఎత్తుకు సరిపోయే టాప్ హీరోయిన్స్ అనుష్క, కాజల్ అగర్వాల్, నయనతార, నమిత వంటి నాయికలను ఎంపిక చేసుకున్నాడు. అయితే అంతగా ఎత్తు లేకపోయినా, వర్షం చిత్రంలో త్రిష తో, ఛత్రపతిలో శ్రీయతో ప్రభాస్ సింక్ అయిన విధానం చర్చించదగినదే.
ఇన్నేళ్లలో డార్లింగ్ సరసన నటించకపోయినా కానీ, సమంతకు దారులు పూర్తిగా మూసుకుపోలేదు. మునుముందు ప్రభాస్ సరసన నటించేందుకు ఆస్కారం లేకపోలేదు. ప్రభాస్ పాన్ ఇండియాలో సత్తా చాటుతున్న ఈ సమయంలో లోకల్ గాళ్స్ కంటే, బాలీవుడ్ నటీమణుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడు. కానీ ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ వెబ్ సిరీస్ లతో సమంత పేరు కూడా పాన్ ఇండియాలో మార్మోగుతోంది. అందువల్ల ప్రభాస్ సరసన సమంత నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కొన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది. తొందర్లోనే ఈ రేర్ కాంబినేషన్ కుదురుతుందేమో చూడాలి. అనుష్క సరసన సూర్యను సింగం ఫ్రాంఛైజీ కోసం మ్యానేజ్ చేసినట్టే ఛాయాగ్రాహకుడు కొంత శ్రమిస్తే, ప్రభాస్ సరసన సమంతను కూడా సెట్ చేయగలరు.