వార్ 2 సెన్సార్.. రన్ టైమ్ లో తేడా వచ్చిందిగా!
ప్రస్తుతం రిలీజ్ ముందే సినిమా మీద హైప్‌ను మరింత పెంచేలా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా వార్ 2 చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.;
పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలతో తెరకెక్కిన వార్ 2 మూవీ ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు ఇందులో ప్రధాన పాత్రల్లో నటించడంతో ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మితమవుతోంది.
సినిమా రిలీజ్‌కు వారం రోజులే ఉన్న నేపథ్యంలో, ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ షూరు అయ్యాయి. తారక్, హృతిక్ కాంబినేషన్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయో చూడాలి. తెలుగు, తమిళ, హిందీతో పాటు పలు భాషల్లో పాన్ ఇండియా లెవెల్‌లో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
ప్రస్తుతం రిలీజ్ ముందే సినిమా మీద హైప్‌ను మరింత పెంచేలా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా వార్ 2 చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నుంచి యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. ఈ సర్టిఫికేట్ రావడంతో సినిమా విడుదలకు చివరి అడ్డంకీ తొలిగినట్లయింది.
ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్, భారీ స్టంట్స్, కథలోని టర్న్ అండ్ ట్విస్ట్‌లు హైలెట్ కానున్నాయట. ఇక రివ్యూకు వెళ్ళగా సెన్సార్ బోర్డ్ పెద్గా కట్స్ ఏమి చెప్పలేదని తెలుస్తోంది. ఇక హిందీ వెర్షన్ నిడివి 2 గంటలు 53 నిమిషాలు 24 సెకన్లు కాగా, తెలుగు మరియు తమిళ వెర్షన్‌ల నిడివి 2 గంటలు 51 నిమిషాలు 44 సెకన్లుగా ఉండబోతోంది. అంటే హిందీ కంటే సౌత్ లో తక్కువ నిడిసితోనే రానుంది. ఇలాంటి భారీ యాక్షన్ డ్రామాకు ఇంత రన్ టైమ్ రావడం ఆసక్తికరమే.
వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించబోతున్నారు. ఈసారి కథ మరింత ఇంటెన్స్‌గా, యాక్షన్ సన్నివేశాలు మరింత రియలిస్టిక్‌గా ఉంటాయనే మేకర్స్ చెబుతున్నారు. కానీ ప్రమోషన్ డోస్ ఇంకాస్త పెంచాల్సిన అవసరం ఉంది. ఇక భారీ యాక్షన్ సినిమాలకు సాధారణంగా సెన్సార్ విషయంలో కొన్ని కట్‌లు చేయాల్సి వస్తుంటుంది. కానీ వార్ 2కు యు/ఎ సర్టిఫికెట్ రావడం విశేషం. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా థియేటర్స్‌లో సినిమా చూడడానికి ఇది హైప్‌ను పెంచుతోంది.