మాజీ ప్రియురాలి భ‌ర్తను త‌లుచుకున్న న‌టుడు!

మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్‌తో వివేక్ ఒబెరాయ్ ప్రేమాయ‌ణం బ్రేక‌ప్ వ్య‌వ‌హారాలు తెలిసిన‌వే.

Update: 2024-05-22 17:30 GMT

మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్‌తో వివేక్ ఒబెరాయ్ ప్రేమాయ‌ణం బ్రేక‌ప్ వ్య‌వ‌హారాలు తెలిసిన‌వే. ఆ త‌ర్వాత అభిషేక్ బ‌చ్చ‌న్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఐష్‌. గురు చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ప్రేమాయ‌ణం సాగింది. అయితే ఇప్పుడు ఇన్నేళ్ల త‌ర్వాత ఒబెరాయ్ త‌న స్నేహితుడు అభిషేక్ బ‌చ్చ‌న్ ని గుర్తు చేసుకున్నాడు. బ‌డ్డీ అని పిలిచాడు!

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అభిషేక్ బచ్చన్‌తో కలిసి పనిచేసిన సమయాన్ని మళ్లీ గుర్తు చేసుకున్నాడు. 2004లో విడుదలైన `యువ` (మ‌ణిర‌త్నం)లో ఆ ఇద్ద‌రూ కలిసి న‌టించారు. ఐశ్వర్యరాయ్‌తో వివేక్ విడిపోయిన ఒక సంవత్సరం తర్వాత ఈ చిత్రం విడుదలైంది. ఈ వారంతో సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో వివేక్ తన కాలును మూడు ముక్కలుగా విరిచారంటూ నాటి ప్ర‌మాదాన్ని గుర్తు చేసుకున్నాడు. ప్ర‌మాద‌ స‌మ‌యంలో అభిషేక్‌తో పాటు అజయ్ దేవగన్ అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

జాతీయ మీడియాతో వివేక్ మాట్లాడుతూ-``భయంకరమైన మోటార్‌సైకిల్ ప్రమాదంలో నా ఎడమ కాలు మూడు చోట్ల విరిగిపోవడంతో అది తీవ్ర‌మైన‌ నొప్పిగా మారింది. నా పెద్ద తమ్ముడు అజయ్ .. నా స్నేహితుడైన అభిషేక్ నా పక్కనే ఉన్నారు.. నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లడం నాకు గుర్తుంది. ఎముకలు విరిగిన వేదనలో నా వేద‌న‌లో నేను ఉన్నాను. రక్తంతో నా చర్మాన్ని చీల్చివేసిన అనుభూతితో ఉన్నాను`` అని గుర్తు చేసుకున్నాడు. అధ్వాన్నంగా మారింది నా ప‌రిస్థితి. నా ప్రమాదం చూసి మణి అన్నకు గుండెపోటు వచ్చిందని తెలిసింది. మేమిద్దరం ఆసుపత్రిలో కోలుకుంటున్నప్పుడు అజయ్- అభిషేక్ నాతో ఉన్నారు. అంత స్పష్టంగా లేని స్థితిలో జోకులు వేస్తూ నొప్పి నివారణ మందులతో నాలో ఉత్సాహాన్ని పెంచారు. కోలుకోవడానికి నాలుగు నెలలు పట్టింది`` అని వివేక్ చెప్పాడు.

Read more!

చాలా చిక్కులు వేద‌న అనుభ‌వించిన‌ నాలుగు నెలల తర్వాత సెట్స్‌లో మళ్లీ క‌లుసుకున్నాం. ఫనా, అంజనా అంజనీ పాటల షూటింగ్‌లో నేను కుంటుకుంటూ వెళుతుంటే యూనిట్ మొత్తం నా మనోధైర్యాన్ని పెంచింది. మేము ఆ షూట్లు ఎలా చేసానో అంటూ కొన్నిసార్లు ఆశ్చర్యపోతున్నాను అని అతను చెప్పాడు.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన `యువ` మంచి విజయం సాధించింది. ఈ చిత్రం హిందీలో మాత్రమే కాకుండా తమిళంలో (ఆయుత ఎజుత్తు పేరుతో) కూడా ప్రజాదరణ పొందింది. వివేక్ నటన కూడా నచ్చింది. ఈ చిత్రం కోల్‌కతా నేప‌థ్యంలోని క‌థ‌తో తెర‌కెక్కింది. ఇది ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే క‌థ‌ - మైఖేల్ (అజయ్ దేవగన్), అర్జున్ (వివేక్ ఒబెరాయ్), లల్లన్ సింగ్ (అభిషేక్ బచ్చన్).. వారి జీవితాలు రాష్ట్ర రాజకీయాల కారణంగా ఎలాంటి చిక్కుల్లో ప‌డ్డాయి? అన్న‌ది తెర‌పై చూపారు. యూత్ లీడర్ కి ఉండే ఎత్తుపల్లాలను తెర‌పై చూపారు.

ఈ చిత్రం ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు (అభిషేక్ బచ్చన్), ఉత్తమ సహాయ నటి (రాణి ముఖర్జీ), ఉత్తమ చిత్రం - విమర్శకులు, ఉత్తమ స్క్రీన్ ప్లే (మణిరత్నం) సహా అనేక అవార్డులను గెలుచుకుంది.

Tags:    

Similar News