మోహన్ లాల్ కుమార్తె తెరంగేట్రం
బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లో నటవారసుల వెల్లువ గురించి నిరంతరం కథనాలు వస్తున్నా, మాలీవుడ్ నటవారసులపై అంత ఇంట్రెస్టింగ్ స్టోరీలేవీ లేవు.;
మాలీవుడ్ లో నటవారసుల ఆరంగేట్రం గురించి చర్చ జరిగేది తక్కువే. బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లో నటవారసుల వెల్లువ గురించి నిరంతరం కథనాలు వస్తున్నా, మాలీవుడ్ నటవారసులపై అంత ఇంట్రెస్టింగ్ స్టోరీలేవీ లేవు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటవారసుడు దుల్కార్ సల్మాన్ గురించి ఎక్కువ చర్చ సాగుతోంది. ఆ తర్వాత దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ గురించి యూత్ ఎక్కువగా చర్చిస్తుంది. ఇక మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ కి సినిమాలపై అనురక్తి తక్కువ..రేర్ గా నటిస్తున్నాడు. అందువల్ల అతడు నిరంతరం వార్తల్లో ఉండడు.
ఇప్పుడు మోహన్ లాల్ కుమార్తె, ప్రణవ్ లాల్ సోదరి విస్మయ మాలీవుడ్‌లో నటనారంగేట్రం చేస్తోంది.
జుడ్ ఆంథనీ దర్శకత్వంలో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్న `తుడక్కం`లో విస్మయ నటించనుంది. విస్మయ స్వతహాగా రచయిత. కథలు రాయడానికి, చెప్పడానికి ఆసక్తిగా ఉంటుంది. కానీ ఇప్పుడు నటిగా అడుగులు వేస్తోంది. దీంతో తొలి ప్రయత్నం చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అభిమానులు విస్మయ కూడా తన తండ్రి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నారు. ఇంతకుముందే ప్రణవ్ మోహన్ లాల్ తన సోదరికి అభినందనలు తెలిపారు.
నా సోదరి సినిమా ప్రపంచంలోకి మొదటి అడుగు వేస్తోంది. ఈ ప్రయాణంలో ముందుకు సాగుతున్న తనపై చాలా గర్వంగా, ఉత్సాహంగా ఉన్నాను! అని ప్రణవ్ సోషల్ మీడియాలో రాసాడు. సోదరికి తన మద్ధతును తెలియజేసాడు. విస్మయ పెద్ద స్టార్ అవ్వాలని అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
మోహన్ లాల్ వరుసగా బ్లాక్ బస్టర్లలో నటించి జోష్ లో ఉన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఎంపురాన్, తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన `తుడారుమ్` విజయాలతో లాల్ ఉత్సాహంగా ఉన్నారు. రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా విజయం సాధించడమే గాక లాల్ నట ప్రదర్శనకు మంచి గుర్తింపు దక్కింది.