• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లుక్ రివీల్ అయ్యిందిగా...

లుక్ రివీల్ అయ్యిందిగా విశ్వంభరా..!

| కానీ అధికారికంగా రిలీజ్ చేయకముందే, ఇప్పుడు అనుకోకుండా చిరంజీవి లుక్ బయటకు వచ్చేసింది.

By - Tupaki Desk
Update: 2024-04-08 13:46 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''విశ్వంభర". బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. సంక్రాంతి టార్గెట్ పెట్టుకొని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. అదే సమయంలో సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకి రాకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా సెట్స్ నుంచి చిరు లుక్ అండ్ గెటప్ లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ అధికారికంగా రిలీజ్ చేయకముందే, ఇప్పుడు అనుకోకుండా చిరంజీవి లుక్ బయటకు వచ్చేసింది.


పంచభూతాల కాన్సెప్ట్ తో రూపొందుతున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ''విశ్వంభర". ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, కాన్సెప్ట్ వీడియో విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో చిరంజీవి లుక్ రివీల్ చెయ్యకుండా, ఆయన షాడో ఇమేజ్ ను మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో బిగ్ బాస్ ఎలాంటి గెటప్ లో కనిపిస్తారో అని ఆలోచిస్తూ.. ఫస్ట్ లుక్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చిరు తాజాగా జనసేన పార్టీకి విరాళం ఇవ్వడం వల్ల సినిమాలో లుక్ రివీల్ అయిపోయింది.


'విశ్వంభర' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుగుతోంది. చిరంజీవి పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. అయితే సోమవారం ఉదయం అన్నయ్యను కలవడానికి తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు షూటింగ్ లొకేషన్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి చిరు రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు సోషల్ మీడియాలో తెలియజేస్తూ, కొన్ని ఫోటోలను పంచుకున్నారు.


చిరంజీవి సైతం కాస్త ఫిల్టర్ ఉపయోగించి తమ్ముళ్ళతో దిగిన ఫోటోలను 'ఎక్స్' లో షేర్ చేశారు. "అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. అధికారం లేకపోయినా, తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను" అని పోస్ట్ పెట్టారు.

ఈ ఫోటోలలో చిరంజీవి మెరూన్ కలర్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నారు. ఆయన మెడలో ఒక లాకెట్ ఉండటం.. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ లో పెద్ద హనుమాన్ విగ్రహం ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇక చిరు హెయిర్ స్టైల్ గత రెండు చిత్రాల కంటే డిఫరెంట్ గా ఉండేలా, కాస్త రింగులు తిరిగినట్లు కనిపిస్తుంది. ఈ విధంగా ప్లాన్ చెయ్యకుండానే 'విశ్వంభర'లోని మెగాస్టార్ లుక్ బయటకు వచ్చేసింది. దీనికి మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నప్పటికీ, ఫస్ట్ లుక్ కోసం ఉండే ఎగ్జైట్మెంట్ మిస్ అవుతుందనే కామెంట్లు చేస్తున్నారు.

'విశ్వంభర' చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీస్తున్న సినిమా. యువి క్రియేషన్స్ బ్యానర్ లో విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. సుర‌భి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి, ర‌మ్య ప‌సుపులేటి తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది.

Tags:    
  • Tollywood 
  • Vishwambhara 
  • Chiranjeevi 
  • Trisha 
  • MallidiVassishta 
  • Pawankalyan 
  • Nagababu 
  • KonidelaProductionCompany 
  • LordHanuman 
  • Hyderabad 
  • FilmIndustry 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS