ఎట్ట‌కేల‌కు ముగించిన విశ్వంభ‌ర‌!

ఎట్ట‌కేల‌కు 'విశ్వంభ‌ర' చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. చిరంజీవి-మౌనీరాయ్ పై స్పెష‌ల్ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌తో టాకీ స‌హా షూటింగ్ మొత్తం శుక్ర‌వారంతో పూర్త‌యింది.;

Update: 2025-07-26 07:03 GMT

ఎట్ట‌కేల‌కు 'విశ్వంభ‌ర' చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. చిరంజీవి-మౌనీరాయ్ పై స్పెష‌ల్ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌తో టాకీ స‌హా షూటింగ్ మొత్తం శుక్ర‌వారంతో పూర్త‌యింది. తొలుత టాకీ పార్ట్ పూర్త‌యిన ఐటం సాంగ్ పెండింగ్ ప‌డ‌టంతో? అప్ప‌టి నుంచి పెండింగ్ లోనే ఉంది. ఐటం భామ‌గా ఏవ‌ర్ని ఎంపిక చేయాలి? అన్న అంశం పై యూనిట్ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డింది. ప‌లువురు భామ‌ల్ని ప‌రిశీలించి చివ‌రిగా ఆ ఛాన్స్ బాలీవుడ్ న‌టి మౌనీ రాయ్ ని వ‌రించ‌డంతో లైన్ క్లియ‌ర్ అయింది. తాజాగా ఆ పాట చిత్రీక‌ర‌ణ కూడా పూర్తయిన నేప‌థ్యంలో? రిలీజ్ తేదీ కూడా లాక్ చేసే అవ‌కాశం ఉంది.

అయితే ఇది సోషియా ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ చిత్రం కావ‌డంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లోనూ జాప్యం క‌నిపిస్తుంది. అనుకున్న టైమ్ లో ఆ ప‌నులు పూర్తి కాక‌పోవ‌డం కూడా రిలీజ్ వాయిదాకి కార‌ణంగా క‌నిపిస్తుంది. దీంతో పాటు పాట చిత్రీక‌ర‌ణ కూడా పెండింగ్ ప‌డ‌టంతో రిలీజ్త తేదీపై మేక‌ర్స్ కే స్ప‌ష్ట‌త లేకుండా పోయింది. తాజాగా ఆ ప‌నుల‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే చిత్రాన్ని సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేసే అవకాశం ఉంద‌ని వార్త‌లొస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 18వ తేదీన రిలీజ్ చేసే ఆలోచన‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

కానీ మేక‌ర్స్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స‌మాచారం రాలేదు. అతి త్వ‌ర‌లోనే రిలీజ్ పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని యూనిట్ వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. పాట ముగించిన నేప‌థ్యంలో చిరంజీవి య‌ధావిధిగా మ‌ళ్లీ 157 షూటింగ్ లో బిజీ కానున్నారు. ఈ సినిమాతో సంబంధం లేకుండా చిరంజీవి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో 157వ చిత్రం పట్టాలెక్కించ‌డం ఓ రెండు షెడ్యూళ్ల షూటింగ్ కూడా పూర్తి చేయడం జ‌రిగింది.

అనంత‌రం ఐటం పాట కోస‌మే చిరంజీవి గ్యాప్ తీసుకున్నారు. తాజాగా ఆ పాట పూర్తయిన నేప‌థ్యంలో చిరు బ్యాక్ టూ 157 గా తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ స‌హా అన్ని ప‌నులు డిసెంబ‌ర్ క‌ల్లా పూర్తిచేసి జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ డేట్ ను కూడా అనీల్ లాక్ చేసాడు. ఈ సినిమా రిలీజ్లో మాత్రం ఎలాంటి జాప్యం ఉండ‌దు.

Tags:    

Similar News