• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విశ్వక్, బేబీ వివాదం ఇక...

విశ్వక్, బేబీ వివాదం ఇక ముగియదా..?

| విశ్వక్ సేన్ కి తాను బేబీ కథ చెప్పాల ని అనుకున్న విషయం నిజమేనని, అయితే, కనీసం కథ కూడా విశ్వక్ వినలేదు అని , ఆయన ఎందుకు వినలేదో కూడా తనకు తెలీదన్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-02 05:16 GMT

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఆయన తన పంథాలో తాను సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అయితే, ఇటీవల విశ్వక్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. కాగా, విశ్వక్ ఇటీవల ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బేబీ మూవీ ముందు ఆఫర్ విశ్వక్ సేన్ కే వచ్చింది. అయితే, కనీసం విశ్వక్ కథ కూడా వినడానికి ఆసక్తి చూపించలేదు అనే విషయాన్ని డైరెక్టర్ సాయి రాజేష్ ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. ఈ విషయం పై సమయం వచ్చినప్పుడల్లా విశ్వక్ స్పందిస్తూనే ఉన్నాడు.

ఇటీవల ఓ మూవీ ఈవెంట్ లో తన మనసు లోని మాటల ను బయటపెట్టాడు. మన దగ్గరకు వచ్చిన అన్ని కథల ను చేయలేమనీ, కొన్నిసార్లు నో చెప్పాల్సి వస్తుందని, సినిమా హిట్ అయ్యింది కదా అని, విమర్శించవద్దు అని గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. కాగా, తాజాగా ఈ వివాదం పై డైరెక్టర్ సాయి రాజేష్ కూడా స్పందించడం గమనార్హం.

విశ్వక్ సేన్ కి తాను బేబీ కథ చెప్పాల ని అనుకున్న విషయం నిజమేనని, అయితే, కనీసం కథ కూడా విశ్వక్ వినలేదు అని , ఆయన ఎందుకు వినలేదో కూడా తనకు తెలీదన్నారు. ఒకవేళ విశ్వక్ డైరెక్టర్స్ లిస్ట్ లో తాను లేకపోవచ్చు. అయితే, ఇవన్నీ పక్కన పెడితే, విశ్వక్ నో చెప్పిన విధానం తనకు నచ్చలేదని, బాధేసిందని అన్నాడు. అతను నో చెప్పిన సినిమా ఈ రోజు హిట్ అయ్యింది. అయితే, హిట్ అయితే, ఎంజాయ్ చేయాలి కానీ, విమర్శించవద్దు అని విశ్వక్ అన్న మాటకు నేను చాలా బాధపడ్డాను అని సాయి రాజేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

తాను ఓ హీరో తన మూవీ రిజెక్ట్ చేశాడు అని చెప్పాను. కానీ, ఆ హీరో పేరు నేను బయట కు చెప్పలేదన్నాడు. హీరోలు సినిమాని రిజెక్ట్ చేయడం కామనే అని, కాకపోతే అది కూడా మర్యాదగా ఉంటే బాగుంటుంది అనేది తన అభిప్రాయం అని పేర్కొన్నారు. అయితే, తనకు విశ్వక్ మీద మాత్రం ఎలాంటి కోపం లేదు అని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బేబీ మూవీ బ్లాక్ బస్టర్ గా మారింది. ఈ మూవిని చూసి టాలీవుడ్ సెలబ్రెటీలు అందరూ ఇంప్రెస్ అవతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ స్పెషల్ మీటింగ్ పెట్టి ప్రశంసలు కురిపించారు, రామ్ లాంటి యంగ్ హీరో స్పెషల్ గా విషెస్ చెప్పారు. ఇప్పుడు మెగాస్టార్ కూడా ఈ మూవీ ని సీన్ టూ సీన్ వివరిస్తూ మరీ, నటీనటులు, డైరెక్టర్ పై ప్రశంసలు కురిపిస్తుండటం విశేషం.

Tags:    
  • Vishwaksen 
  • Sairajesh 
  • Babymovie 
  • Controversey 
  • Blockbuster 
  • Interview 
  • Director 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS