అందులో నా సీన్స్ కట్ చేశారు.. కానీ రానా క్యారెక్టర్ చనిపోవాలి

కానీ, ఆ సినిమాలో తన సీన్స్ ను బాగా ఎడిట్ చేశారని అన్నారు. అలా చేసినందుకు తాను ఎంతో ఫీల్ అయ్యాయని, అందువల్ల డైరెక్టర్ తో మట్లాడలేదని చెప్పారు.;

Update: 2025-07-12 01:30 GMT

తమిళ నటుడు విష్ణు విశాల్‌ విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఆయన లీడ్ రోల్లో తెరకెక్కిన తాజా చిత్రం 'ఓహో ఎంథన్ బేబీ' శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న విష్ణు కెరీర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కెరీర్ తొలి నాళ్లలో తనను ఇండస్ట్రీలో అసలు నటుడిగానే గుర్చించలేదని అన్నారు.

తమిళ ఇండస్ట్రీ నన్ను అసలు నటుడిగా గుర్తించలేదు. నేనేంతో బాధపడ్డాను. నా సినిమాలు సైతం ఆదరించలేదు. కానీ, ప్రేక్షకులు కొంతవరకు నన్ను నటుడిగా ఒప్పుకున్నారు. ప్రతి సంవత్సరం టాప్ 20 సినిమాలు తీసుకోండి. అందులో ఒక్కటైనా నా సినిమా ఉంటుంది. అది మాత్రం ఎవరూ గుర్తించ లేదు. అయితే ఎఫ్ఐఆర్‌, మట్టి కుస్తీ సినిమాల రిలీజ్ తర్వాత నాకు కొంత గుర్తింపు దక్కింది. అప్పుడు ఇండస్ట్రీ నన్ను స్వాగతించింది. అని విశాల్ చెప్పుకొచ్చారు.

అలాగే రాట్ ససన్ లాంటి హిట్ సినిమా తర్వాత కూడా, రానాతో నటించిన అరణ్య లో తన సీన్స్ ట్రిమ్ చేశారని చెప్పుకొచ్చారు. అరణ్య సినిమా గురించి విశాల్ మాట్లాడారు. అందులో తన క్యారెక్టర్ చాలా ప్రత్యకమైనది అని చెప్పారు. సినిమా ఎండ్ దాకా తన రోల్ ఉంటుందని, రానా క్యారెక్టర్ ఇందులో చనిపోవాల్సి ఉంటుందని అన్నారు.

కానీ, ఆ సినిమాలో తన సీన్స్ ను బాగా ఎడిట్ చేశారని అన్నారు. అలా చేసినందుకు తాను ఎంతో ఫీల్ అయ్యాయని, అందువల్ల డైరెక్టర్ తో మట్లాడలేదని చెప్పారు. "అరణ్య సినిమాలో నాది మంచి రోల్. నేను సినిమాలో లాస్ట్ దాకా ఉండాలి. కానీ, సెకండ్ హాఫ్ లో చాలా వరకు నా సీన్స్ ట్రిమ్ చేశారు. అందుకు చాలా బాధపడ్డా. దర్శకుడితో మాట్లాడ లేదు కూడా. ఆ సినిమాలో రానా పాత్ర చనిపోవాల్సి ఉంది. కానీ, రిలీజ్ కు ముందు కథలో కొన్ని మార్పులు చేశారు. మరో 5 రోజుల్లో విడుదల అనగా, నాకు చెప్పకుండానే నా రోల్ కు సంబంధించిన సీన్స్ కట్ చేశారు. దీంతో ప్రభుతో మాట్లాడలేదు" అని విష్ణు చెప్పారు.

ఇక రజనీకాంత్ కీలక పాత్రలో గతేడాది వచ్చిన లాల్ సలామ్ సినిమాపై కూడా విష్ణు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మొదట అనుకున్న కథ ప్రకారం, అందులో హీరో తనే అని చెప్పారు. రజనీకాంత్‌ ను కేవలం గెస్ట్ రోల్ కోసమే తీసుకున్నామని, కానీ పరిస్థితులు తారుమారు అవ్వడం వల్ల ఇలా జరిందని అన్నారు.

లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్‌ పాత్ర రన్ టైమ్ 25 నిమిషాలేనట. కానీ, స్క్రిప్ట్‌లో మార్పుల వల్ల ఆయన రోల్ పొడగించాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో గంటపాటు ఆయన స్క్రీన్ టైమ్ పెరిగిందని అన్నారు. అయితే ఓ అభిమానిగా దానికి సంతోషించానని, కానీ దాన్ని ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయలేదని అన్నారు.

Tags:    

Similar News