పుష్ప-2 ప్రీమియర్ షో ఘటన.. 8 నెలల తర్వాత మంచు విష్ణు స్పందన ఇలా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-2 ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప-2 ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫిమేల్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన ఆ చిత్రం.. గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి వేరే లెవెల్ హిట్ గా నిలిచింది.
ఎన్నో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అప్పటికే ఉన్న మరిన్ని రికార్డులు బద్దలు కొట్టింది. బాక్సాఫీస్ వద్ద రూ.వేల కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ప్రీమియర్స్ టైమ్ లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ రాగా.. ఆయనను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు.
ఆ సమయంలో తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. ఒకరోజు తర్వాత బయటకు వచ్చారు. ఇప్పుడు అది జరిగిన ఎనిమిది నెలల తర్వాత టాలీవుడ్ హీరో మంచు విష్ణు రెస్పాండ్ అయ్యి పలు వ్యాఖ్యలు చేశారు.
ఆ కేసు కోర్టులో నడుస్తుండడం వల్ల తాను పెద్దగా మాట్లాడలేనని విష్ణు తెలిపారు. కానీ మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ఆ ఘటనకు బన్నీ బాధ్యుడు కాడని మాత్రం చెప్పగలనని అన్నారు. ఆయన తనలా ఉండటమే తప్పైపోయిందని వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా ఆర్టిస్టులకు థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలనిపిస్తుందని తెలిపారు. ఆడియన్స్ రెస్పాన్స్ తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుందని అన్నారు.
అదే తమకు కిక్ ఇస్తుందని, వింబుల్డన్ గెలిచినంత తృప్తిగా ఉందని చెప్పారు. తమను సిల్వర్ స్క్రీన్ పై చూసి జనాలు అరుస్తుంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది అని క్వశ్చన్ చేశారు. దాని కోసమే తాము కష్టపడేదని, ఆకలిని చంపుకుని డైట్ చేసేదని, చెమటలు చిందించేదని, రక్తాన్ని ధారపోసేదని వ్యాఖ్యానించారు. ఏదేమైనా అభిమాని మరణించడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలా బన్నీని బాధ్యుడిని చేయడం మాత్రం తప్పని అభిప్రాయపడ్డారు.