విశాల్ 'మగుడం'.. ఏం జరుగుతోంది? ఆ వార్తలు నిజమేనా?
కోలీవుడ్ వెర్సటైల్ హీరో విశాల్.. మగుడం మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. తన కెరీర్ లో 35వ సినిమాగా రూపొందుతున్న ఆ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు.;
కోలీవుడ్ వెర్సటైల్ హీరో విశాల్.. మగుడం మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. తన కెరీర్ లో 35వ సినిమాగా రూపొందుతున్న ఆ సినిమాకు రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి నిర్మిస్తున్నారు. విశాల్ సరసన యంగ్ బ్యూటీ దుషారా విజయ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
సినిమాలో స్టార్ హీరోయిన్ అంజలి కీలక పాత్ర పోషిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. రీసెంట్ గా మూడో షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. తొలి రెండు షెడ్యూళ్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. అదే సమయంలో సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ కూడా ఇస్తున్నారు.
ఇటీవల టైటిల్ టీజర్ రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా, అందులో విశాల్ మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించి షాక్ ఇచ్చారు. ఓ లుక్ లో వైరెటీ కటింగ్ లో కనిపించారు. మరో లుక్ లో సూట్, బూట్ తో ముసలివాడిలా ఉన్నారు. ఇంకో లుక్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలా డీసెంట్ లుక్ తో ఉన్నారు.
దీంతో విశాల్ మూడు లుక్స్ ఆసక్తి రేపాయి. సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్స్, షేడ్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అదంతా ఓకే గానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతోంది. మగుడం ప్రాజెక్ట్ లో పెద్ద మార్పులు జరిగాయని ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ రవి అరసు సినిమా నుంచి తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు విశాల్ మగుడం చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు నెటిజన్ల నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. విశాల్ దర్శకత్వం ఎలా చేస్తారో చూడటానికి కొందరు ఉత్సాహంగా ఉండగా, మరికొందరు విమర్శిస్తున్నారు. తుప్పరివాలన్ 2 సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు.
ఇప్పుడు మగుడం మూవీ విషయంలో అదే జరిగింని, సమస్య దర్శకులతో కాదు, విశాల్‌తో ఉండవచ్చని విమర్శకులు ఆరోపిస్తున్నారు. కానీ మగుడం దర్శకత్వ బాధ్యతల నుంచి రవి తప్పుకున్న వార్తల్లో నిజమెంతో కూడా తెలియదు. మరి విశాల్ నిజంగా మగుడం సినిమాను డైరెక్ట్ చేస్తున్నారో.. చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.