విశాల్ శరీరానికి 119 కుట్లు... షాకవుతున్న ఆడియన్స్
హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయం చేయనక్కర్లేదు. తమిళ హీరో అయినప్పటికీ ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.;
హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయం చేయనక్కర్లేదు. తమిళ హీరో అయినప్పటికీ ఆయనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నో తెలుగు, తమిళ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ కు యాక్షన్ హీరో అనే పేరు కూడా ఉంది. యాక్షన్ సీన్స్ లో ఆయన పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని అందరూ అంటూంటారు.
దానిక్కారణం ఆయన ఎలాంటి డూప్స్ లేకుండా, అన్నీ స్వయంగా తానే చేయడం. ఎంతోమంది హీరోలు యాక్షన్ సీన్స్ కోసం డూప్ ను వాడుతుంటారు. చిన్న చిన్న ఫైట్స్ అయితే వాళ్లే మేనేజ్ చేస్తారు కానీ ఏదైనా పెద్ద సీక్వెన్స్, యాక్షన్ సీన్స్ చేయాలంటే మాత్రం రిస్క్ తీసుకోకుండా డూప్ ను పెట్టి ఆ సీన్స్ ను షూట్ చేస్తుంటారు. కానీ విశాల్ మాత్రం అలా కాదు.
విశాల్ శరీరానికి 119 కుట్లు
ఎంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అయినా ఆయనే స్వయంగా చేస్తారు. ఎంత భారీ స్టంట్ అయినా ఆయనే నటిస్తారు. అందుకే అతని శరీరానికి ఏకంగా 119 కుట్లు పడ్డట్టు విశాల్ వెల్లడించారు. సినిమాల్లో ఎలాంటి డూప్స్ లేకుండా చేయడం వల్లే తనకు అన్ని కుట్లు పడ్డాయని అతను పేర్కొన్నారు. విశాల్ త్వరలోనే యువర్స్ ఫ్రాంక్లీ విశాల్ పేరుతో ఓ పాడ్ కాస్ట్ ను ప్రారంభించనున్నారు.
విశాల్ లాంటి నటులు అరుదు
ఈ పాడ్‌కాస్ట్ ను ఎలాంటి స్క్రిప్ట్ లేకుండా, ఏ రకమైన ఫిల్టర్లు లేకుండా చేయనున్నట్టు విశాల్ వెల్లడించారు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో ను రిలీజ్ చేయగా, ఆ ప్రోమోలో తన శరీరానికి ఉన్న కుట్లు గురించి ఆయన బయటపెట్టారు. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, అది విన్న వాళ్లంతా షాకవుతున్నారు. ఇండస్ట్రీలో తమ ప్రాణాలకు తెగించి నటించే విశాల్ లాంటి నటులు చాలా అరుదుగా ఉంటారని అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా విశాల్ ఇండస్ట్రీకి వచ్చి రీసెంట్ గానే 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. చెల్లమే మూవీతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విశాల్, త్వరలోనే నటి సాయి ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, విశాల్ ప్రస్తుతం మగుడం అనే సినిమా చేస్తున్నారు. డైరెక్టర్ తో విబేధాల వల్ల ఆ సినిమాను స్వయంగా అతనే దర్శకత్వం వహించాలని విశాల్ డిసైడ్ అయ్యారని కోలీవుడ్ సర్కిల్స్ లో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.