హోట‌ల్ సిబ్బంది తో సాధార‌ణ వ్య‌క్తుల్లా విరుష్క‌!

సినీ- క్రీడా రంగాలలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ అగ్రస్థానంలో ఉంటారు.

Update: 2026-06-09 13:41 GMT

సినీ- క్రీడా రంగాలలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ అగ్రస్థానంలో ఉంటారు. కేవలం తమ రంగాలలోనే కాకుండా సామాజికంగా వారు ప్రదర్శించే హుందాతనం, నిరాడంబరతతో ఎంతోమంది అభిమానుల హృదయాలకు ద‌గ్గ‌ర‌య్యారు. తాజాగా ఈ దంపతులు బస చేసిన లగ్జరీ హోటల్ సిబ్బంది పట్ల చూపిన ఆదరణ వారి వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మలు ఇటీవల ప్రత్యేక పర్యటనలో భాగంగా ఓ ప్రముఖ హోటల్‌లో విడిది చేశారు. బస ముగిసిన అనంతరం అక్కడ తమకు సేవలందించిన హోటల్ సిబ్బందితో వారు ఎంతో సాదాసీదాగా గడిపారు.

హోటల్ మేనేజ్‌మెంట్ - సర్వీస్ స్టాఫ్ అందరితో కలిసి నవ్వుతూ గ్రూప్ ఫోటోలకు ఫోజులిచ్చారు. సెలబ్రిటీలమనే గర్వం ఏమాత్రం చూపించకుండా సాధారణ వ్యక్తుల్లా కలిసిపోయిన తీరు అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ పర్యటనలో విరుష్క దంపతులు ఫోటోలకే పరిమితం కాలేదు. హోటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రత్యేకంగా చేతితో రాసిన లేఖలను బహుమతిగా ఇచ్చారు. తమ బసను ఎంతో సౌకర్యవంతంగా, మరుపురానిదిగా మార్చినందుకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. సెలబ్రిటీలు సాధారణంగా టిప్స్ ఇవ్వడం.. థాంక్స్ చెప్పడం చూస్తుంటాం.

కానీ ఇలా స్వయంగా కృతజ్ఞతా పత్రాలు రాయడం వారిలోని సంస్కారానికి నిదర్శనమని నెటిజన్లు కొనియా డుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, విరాట్-అనుష్కలు రాసిన లేఖల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సదరు హోటల్ సిబ్బంది ఈ చిత్రాలను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. `మా జీవితంలో ఇదొక మరుపురాని రోజు. ఇంతటి గొప్ప వ్యక్తులకు సేవలు అందించే అవకాశం రావడం మా అదృష్టం. వారి నిరాడంబరత మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది` అంటూ సంతోషం వ్య‌క్తం చేసారు.

సోషల్ మీడియా వేదికగా అభిమానులు విరాట్, అనుష్కలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. `డబ్బు, కీర్తి ఎంత ఉన్నా తోటి మనుషులను గౌరవించడంలోనే నిజమైన స్టార్‌డమ్ ఉంటుంది` అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. `నిజమైన పవర్‌ కపుల్ అంటే వీరే` అని మరికొందరు కొనియాడుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికులను, సిబ్బందిని సమానంగా ఆదరించాలనే సందేశాన్ని ఈ జంట మాటల్లో కాకుండా తమ చేతల్లో చూపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

పబ్లిక్ లైఫ్‌లో కెమెరా కంటికి చిక్కే ఈ స్టార్ క‌పుల్స్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో ప్రశాంతతను, విలువలను ఇష్టపడతారు. ముఖ్యంగా తమ పిల్లల ప్రైవసీని కాపాడుకుంటూనే సమాజంలో తోటి వారితో దయతో మెలగాలనే ఆదర్శాన్ని పాటిస్తున్నారు. గతంలో కూడా పలు సందర్భాల్లో అభిమానులతో, సాధారణ సిబ్బందితో ప్రవర్తించిన తీరు వార్తల్లో నిలిచింది. తాజాగా జరిగిన ఈ సంఘటన విరుష్క‌ ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News