ఐదు రోజుల వీకెండ్.. భలే ఛాన్స్ మిస్..?
ప్రతి వీకెండ్ ఒక సినిమా రిలీజ్ అవ్వడం కామన్. సినీ లవర్స్ ప్రతి వారం ఒక కొత్త సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తారు.;
ప్రతి వీకెండ్ ఒక సినిమా రిలీజ్ అవ్వడం కామన్. సినీ లవర్స్ ప్రతి వారం ఒక కొత్త సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఏంటి ఇప్పుడున్న టికెట్ రేట్లకు అది జరిగే పనేనా అంటే అన్నిసార్లు జరగకపోవచ్చు కానీ సగటు సినీ ప్రేక్షకుడు రిలీజైన ప్రతి సినిమా చూడాలనే అనుకుంటాడు. ఒకప్పుడు అదే జరిగేది. కానీ ఇప్పుడు వచ్చిన ఓటీటీల వల్ల దానికి ఎఫెక్ట్ పడింది. మరో 3 వారాలు ఆగితే ఓటీటీలో వస్తుంది కదా అని అనుకుంటున్నారు.
నెక్స్ట్ వీకెండ్ ని ఖాళీగా..
ఇదిలాఉంటే స్టార్ సినిమాలు ఏవైనా మంచి ఫెస్టివల్ సీజన్ రిలీజ్ కు పోటీ పడతాయి. ఆ నెక్స్ట్ వీకెండ్ ని ఖాళీగా వదిలేస్తారు. లేటెస్ట్ గా ఆగష్టు 14న ఇండిపెండెన్స్ డే వీకెండ్ టర్గెట్ తో వచ్చాయి కూలీ, వార్ 2. రెండు సినిమాలు అంత గొప్ప టాక్ ఏమి రాలేదు. ఏదో సోసో కలెక్షన్స్ తో లాగిస్తున్నాయి. ఐతే ఆగష్టు 27 వీకెండ్ ని అలా ఖాళీగా వదిలేశారు.
అదేంటి అంటే ఆగష్టు 27 వినాయక చవితి ఉంది. ఆరోజు హాలీడే.. ఆ తర్వాత రెండు రోజుల్లో వీకెండ్. అంటే ఐదు రోజుల వీకెండ్ ని ఖాళీగా వదిలేస్తున్నారు. అసలైతే ఆగష్టు 27న రవితేజ మాస్ జాతర రిలీజ్ అవ్వాల్సింది. కానీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదని వాయిదా వేస్తున్నారు. ఆగష్టు 27న రవితేజ సినిమా వస్తే తప్పకుండా మంచి వసూళ్లు వచ్చేవి.
నారా రోహిత్ సుందరకాండ..
రవితేజ మిస్ అయ్యాడు. ఐతే ఆ డేట్ కి నారా రోహిత్ నటించిన సుందరకాండ సినిమా వస్తుంది. ఆ సినిమా ప్రమోషన్స్ బాగా చేస్తూ ఆడియన్స్ దృష్టిలో పడాలని చూస్తున్నారు. రవితేజ మిస్ అవ్వడంతో నారా రోహిత్ కి కలిసి వచ్చే అంశమే. ఐతే ఇంకాస్త ప్రమోషన్స్ చేసి సినిమాను ఆడియన్స్ చూసేలా చేస్తే బెటర్.
ఇండిపెండన్స్ డే వీకెండ్ ని టార్గెట్ చేసిన బడా మూవీస్ వినాయక చవితి వీకెండ్ మాత్రం వదిలేశారు. ఈ టైం లో రావాలనుకున్న రవితేజ మాస్ జాతర కూడా రావట్లేదు. ఐతే మళ్లీ స్పెటెంబర్ ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు సినిమాల రిలీజ్ ఫైట్ జరుగుతుంది. సెప్టెంబర్ 5న మిరాయ్ వర్సెస్ ఘాటి క్రేజీ ఫైట్ ఉండేలా ఉంది.