• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో 'విక్రమార్కుడు'.....

మరో 'విక్రమార్కుడు'.. సంతోషం మరియు బాధ

| రాజమౌళి స్థాయిని, స్టామినాను మరింత పెంచిన సినిమా విక్రమార్కుడు అనడంలో సందేహం లేదు

By - Tupaki Desk
Update: 2024-03-07 06:16 GMT

18 సంవత్సరాల క్రితం వచ్చిన విక్రమార్కుడు సినిమాను ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు అంటే ఆ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి స్థాయిని, స్టామినాను మరింత పెంచిన సినిమా విక్రమార్కుడు అనడంలో సందేహం లేదు.

మాస్ మహారాజా రవితేజ ను రెండు విభిన్నమైన పాత్రల్లో చూపించి రాజమౌళి ఆవిష్కరించిన విక్రమార్కుడు సినిమా కు సీక్వెల్‌ అంటూ చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు విక్రమార్కుడు 2 ఉండబోతుందని నిర్మాత కేకే రాధా మోహన్‌ అధికారికంగా ప్రకటించి ఫ్యాన్స్ కి సంతోషకర వార్తను తెలియజేశాడు.

ఆయన నిర్మాణంలో రూపొందిన భీమా సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే విక్రమార్కుడు 2 సినిమాను ప్రారంభిస్తామని అధికారికంగా ప్రకటించాడు. కథ కూడా రెడీగా ఉందని తెలియజేశాడు.

కథ కు రవితేజ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే కచ్చితంగా వెంటనే షూటింగ్‌ షురూ అవ్వబోతున్నట్లుగా నిర్మాత పేర్కొన్నాడు. విక్రమార్కుడు 2 కథను విజయేంద్ర ప్రసాద్‌ రెడీ చేశారట.. కానీ దర్శకత్వం మాత్రం రాజమౌళి వహించే అవకాశం లేదు. రాజమౌళి లేకుండానే విక్రమార్కుడు 2 సినిమా అనేది బాధ కలిగించే విషయం.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం విక్రమార్కుడు 2 సినిమాకు సంపత్‌ దర్శకత్వం వహించబోతున్నాడట. ప్రస్తుతం సంపత్‌ విక్రమార్కుడు 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ లో ఉన్నాడని, రాజమౌళి మేకింగ్‌ కు ఏమాత్రం తగ్గకుండా రెండో పార్ట్‌ ఉండేలా ఆయన ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మొత్తానికి విక్రమార్కుడు 2 రాబోతుంది అనేది కన్ఫర్మ్‌. అయితే దానికి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు కానీ రాజమౌళి దర్శకత్వం వహించబోవడం లేదు. కథ మరియు పాత్రలు అవే అయితే కచ్చితంగా ఎవరు దర్శకత్వం వహించినా హిట్ కొట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Kkradhamohan 
  • Vikramarkudusequel 
  • Raviteja 
  • Rajamouli 
  • Tollywood 
  • Vikramarkudu2 
  • Directorssampath 
  • Vijayendraprasad 

Similar News

ట్రెండీ స్టోరి: విచిత్రంగా పొరుగున ఫేమ‌స్ అయిన స్టార్లు

2026-11-24 00:56 GMT

ఎంత ట్యాలెంట్ చూపించినా రేసులో ఖాళీయే

2026-11-24 00:54 GMT

ఆ టాలీవుడ్ యంగ్ హీరోలకు ట్విట్టర్ పిచ్చి పట్టిందా?

2026-11-24 00:51 GMT

మ‌హేష్ బ‌క్క‌గా అయిపోయార‌ని ఫ్యాన్స్ క‌ల‌త

2026-11-24 00:48 GMT

అల్లు అర్జున్ కోసం ఏకంగా అంత పెద్ద త్యాగం చేయనున్న బోయపాటి శ్రీను..!

2026-11-24 00:42 GMT

ఆరోజుల్లో మాఫియా బెదిరింపుల‌ను ఎదుర్కొనేంత ఫేమ‌స్ ఈ హీరో!

2026-11-24 00:34 GMT

ధూమ్ త‌ర‌హా ఫ్రాంఛైజీ.. ఓటీటీ కోసం అంత బ‌డ్జెట్ పెడ‌తారా?

2026-11-24 00:29 GMT

శ్రీ విష్ణు 'ఫ్యామిలీ ప్యాక్' టీజర్.. పోలీస్ ఇంట్లో గందరగోళం

2026-11-24 00:29 GMT

ఐటం భామ‌గా పూర్ణ కెరీర్ ఎలా ఉంది?

2026-11-24 00:28 GMT

సైనికుడి కుటుంబానికి విష్ణు మంచు సాయం.. నెటిజన్ల ప్రశంసలు!

2026-11-24 00:16 GMT

బిగ్ బాస్ తెలుగు 10లో పొలిటికల్ లెక్కలు ఎక్కువయ్యాయి.. శివాజీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు..!

2026-11-23 18:00 GMT

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

Copyright @2026

Powered by Blink CMS