మళ్ళీ ఇన్నాళ్ళకు అలాంటి కథతో విజయ్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే

Update: 2024-04-30 09:30 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వరుసగా ఒకే తరహా సినిమాలు చేయకుండా మధ్య మధ్యలో అతను ఊహించని కథలను తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ అతని లైనప్ అయితే చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లోనే మరో రెండు సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఆ విషయంపై ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లోనే క్లారిటీ ఇచ్చేశారు. ఇక విజయ్ దేవరకొండ చాలా కాలం తర్వాత మళ్ళీ పొలిటికల్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాజావారు రాణిగారు ఫేమ్ రవి కిరణ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తోనే నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.

రీసెంట్ గా మొత్తం స్క్రిప్ట్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. హీరో నిర్మాత ఇద్దరు కూడా షూటింగ్ మొదలుపెట్టాలి అని కూడా డిసైడ్ అయ్యారు. అయితే ఈ సినిమాలో విజయ్ ఒక పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. టైటిల్ రౌడి ట్యాగ్ హైలెట్ అయ్యే విధంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఒక మంచి సోషల్ ఎలిమెంట్ తో పాటు పొలిటికల్ టచ్ ను కూడా ఈ సినిమాలో గ్రాండియర్ గా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే గతంలో విజయ్ దేవరకొండ నోటా సినిమా ద్వారా మొదటిసారి పొలిటికల్ కథను టచ్ చేశాడు. ఆ సినిమా తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా గ్రాండ్ గానే రిలీజ్ అయ్యింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఇక మళ్ళీ చాలా రోజుల తర్వాత విజయ్ ఒక పొలిటికల్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ ఉండడం విశేషం.

Read more!

దర్శకుడు రవి కిరణ్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మే 9వ తేదీన అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక విజయ్ దేవరకొండ తోనే మరో డిఫరెంట్ ప్రాజెక్టును కూడా సెట్ చేసుకోవాలి అని నిర్మాత దిల్ రాజు ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి తో కూడా పోలీస్ కాన్సెప్ట్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News