పెద్ది, ప్యారడైజ్.. రెండూ ఒకేసారి రిలీజ్ అయ్యి ఉంటే..
ఆ రెండు సినిమాలు మొదట్లో ఒకే సమయంలో రిలీజ్ అవుతాయని అనౌన్స్మెంట్స్ వచ్చాయి. ప్యారడైజ్ మార్చి 26న, పెద్ది మార్చి 27న రావాల్సి ఉండేది.
రామ్ చరణ్ పెద్ది.. నాని ది ప్యారడైజ్.. ఆ రెండు సినిమాలు ఒకే సమయంలో థియేటర్లలోకి వచ్చి ఉంటే సీన్ ఎలా ఉండేదో.. ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఇద్దరూ స్టార్ హీరోలే.. రెండు భారీ సినిమాలే.. కానీ స్టోరీలు, హీరోల రోల్స్ మాత్రం భిన్నం. ఒకటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషనల్ స్టోరీ అయితే.. మరొకటి మాస్, యాక్షన్ తో నిండిన సినిమా అంటూ నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు.
ఆ రెండు సినిమాలు మొదట్లో ఒకే సమయంలో రిలీజ్ అవుతాయని అనౌన్స్మెంట్స్ వచ్చాయి. ప్యారడైజ్ మార్చి 26న, పెద్ది మార్చి 27న రావాల్సి ఉండేది. అంటే ఒక్క రోజు తేడాతోనే చరణ్, నాని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడాల్సింది. కానీ షూటింగ్ తోపాటు ఇతర వర్క్స్ లేట్ కావడంతో రెండు సినిమాలూ వాయిదా పడ్డాయి. దీంతో బిగ్ కాంపిటేషన్ తప్పిపోయింది.
ఇప్పుడు ఆ రెండు సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే.. ఒకే సమయంలో విడుదలై ఉంటే పోటీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.. పెద్దిలో చరణ్ రోల్ సినిమాకు పెద్ద స్ట్రెంత్. పారా అథ్లెట్ గా కనిపించేందుకు చరణ్ కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది. రోల్ లోని అమాయకత్వం, ఎమోషన్స్ ను బాగా చూపించారనే మాట వినిపించింది. కొన్ని సీన్స్ లో చరణ్ యాక్టింగ్ సినిమాను ముందుకు తీసుకెళ్లిందనే అభిప్రాయం వచ్చింది.
పెద్దికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్ట్రెంత్ గా నిలిచింది. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని ముఖ్యమైన సీన్స్ లో బాగా పనిచేసింది. రత్నవేలు కెమెరా వర్క్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే సెకండాఫ్ లో కాస్త స్లో అవ్వడం, కొన్ని సీన్స్ ఎక్కువసేపు సాగడం సినిమాకు మైనస్ గా మారాయని అప్పట్లో నెటిజన్లు రివ్యూస్ ఇచ్చారు. ఇక ప్యారడైజ్ లో నాని పూర్తిగా మరో అవతార్ లో కనిపించారు. జడల్ రోల్ కోసం కష్టపడ్డారు. యాక్టింగ్ లో తన వంతు ప్రయత్నం మొత్తం పెట్టారని చెబుతున్నారు.
మొదటి అరగంట, మధ్యలో వచ్చే ఓ సీన్, జడల్ రోల్ కు సంబంధించిన ఎపిసోడ్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు స్త్రెంత్ ఇచ్చింది. కానీ మాస్ ఎక్కువైందనే మాట వినిపిస్తోంది. వైలెన్స్ ఎక్కువగా ఉండటం కొంతమంది ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపించవచ్చనే అభిప్రాయం వచ్చింది. ముఖ్యంగా సెకండాఫ్ పై విమర్శలు వచ్చాయి. సాంగ్స్ బాగున్నా.. కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరీ ఎక్కువగా అనిపించిందనే టాక్ వచ్చింది.
ఇలా చూస్తే.. ఒకేసారి విడుదలై ఉంటే చరణ్, నాని మధ్య పోటీ కంటే కూడా రెండు సినిమాల మధ్య డిఫరెన్స్ ఎక్కువగా కనిపించేది. పెద్ది ఎమోషన్స్, హీరో యాక్టింగ్ పై నడిస్తే.. ప్యారడైజ్ మాస్, యాక్షన్, వైలెన్స్ పై ఎక్కువగా ఆధారపడిందని నెటిజన్లు అంటున్నారు. చరణ్ పెద్దితో ఒక జోనర్ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే.. నాని జడల్ గా మరో జోనర్ ఆడియన్స్ కోసం వచ్చారని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.