• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీలీల కాదు ఆమె బెస్ట్...

శ్రీలీల కాదు ఆమె బెస్ట్ అంటున్న ఆ హీరో ఫ్యాన్స్..!

| టాలీవుడ్ యంగ్ హీరోల్లో విపరీతమైన యూత్ ఫాలోయింగ్ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు

By - Tupaki Desk
Update: 2023-09-26 07:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరోల్లో విపరీతమైన యూత్ ఫాలోయింగ్ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండకు ఖుషి సక్సెస్ ఖుషి చేస్తుందని అనుకోగా అది కూడా నిరాశపరచింది. అయితే గుడ్డి కన్నా మెల్ల బెటర్ అన్నట్టుగా ఖుషి సినిమాకు మరీ వరస్ట్ టాక్ అయితే రాలేదు. మొదటి రోజు మొదటి ఆట పాజిటివ్ టాక్ తోనే మొదలైనా ఫైనల్ గా మాత్రం ప్రాజెక్ట్ లాస్ వెంచర్ గా మిగిలింది. ఈ సినిమాకు ప్రేమ చూపించినందుకు విజయ్ దేవరకొండ 100 మంది ఫ్యామిలీస్ కి 1 లక్ష చొప్పున ఇచ్చాడని తెలిసిందే.


ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పరశురాంతో ఒక సినిమా గౌతం తిన్ననూరితో మరో సినిమా చేస్తున్నాడు. పరశురాం సినిమా ఆల్రెడీ సగానికి పైగా పూర్తైనట్టు తెలుస్తుంది. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ లాక్ చేస్తున్నారు. ఇక గౌతం తిన్ననూరి సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని టాక్. జెర్సీ తో తెలుగు, హిందీ భాషల్లో తన సత్తా చాటిన గౌతం ఈసారి విజయ్ దేవరకొండతో అదరగొట్టే సినిమా చేస్తాడని అంటున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలని ఫిక్స్ చేయగా ముందు ఓకే చెప్పిన ఆమె ఇప్పుడు సినిమా చేయనని అంటుందట. కారణాలు ఏంటో తెలియదు కానీ ఈ సినిమా నుంచి శ్రీ లీల బయటకు వచ్చేసినట్టే అని తెలుస్తుంది. శ్రీలీల ప్లేస్ లో రష్మిక మందన్నని తీసుకోవాలని మేకర్స్ ఆలోచన. అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాకు శ్రీ లీల వద్దు రష్మికనే కావాలని అంటున్నారు. శ్రీ లీల మిస్ అయ్యిందన్న బాధ ఏమి లేదని విజయ్ రష్మికలు మళ్లీ కలిసి నటిస్తే చూడాలని ఉందని అంటున్నారు.

విజయ్ దేవరకొండ రష్మిక గీతాగోవిందం సినిమాకు కలిసి పనిచేశారు. ఆ సినిమాతోనే రష్మికకు స్టార్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ డియర్ కామ్రేడ్ సినిమాకు కలిసి పనిచేశారు. అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. గౌతం తిన్ననూరి సినిమాతో మరోసారి ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా విజయ్ రష్మికల మధ్య సంథింగ్ సంథింగ్ అని గుసగుస తెలిసిందే. ఈ కారణాల కోసమైనా విజయ్ ఫ్యాన్స్ రష్మికతో కలిసి మరో సినిమా చేయాలని కోరుతున్నారు. సో శ్రీలీల చేయకపోయినా పర్లేదు కానీ రష్మిక జోడీ కడితే ఆ కాంబో వేరే లెవెల్ అనేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. విజయ్ రష్మికల జోడీ అనగానే ఫ్యాన్స్ లో రెట్టింపు ఉత్సాహం వస్తుంది. మరి ఈ ఇద్దరు కలిసి చేయబోతున్న ఈ హ్యాట్రిక్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Tags:    
  • Vijaydeverakonda 
  • Gowtamtinnanuri 
  • Sreeleela 
  • Rashmikamandanna 
  • Tollywood 
  • Geethagovindam 
  • Devarakondafans 

Similar News

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

Copyright @2026

Powered by Blink CMS