విజ్జూ, రషి ఎందుకు రివీల్ చేయడం లేదు?
కానీ ఎంగేజ్మెంట్ అయినట్లు రివీల్ చేయలేదు. ఆ తర్వాత రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన పెయిర్.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అనేక సార్లు వాళ్ల స్టేటస్ లు.. ఫోటోల్లో బ్యాక్ గ్రౌండ్ ద్వారా రివీల్ అయింది. కానీ ఎప్పుడూ ఎక్కడా విజయ్, రష్మిక రివీల్ చేయలేదు.
రీసెంట్ గా అక్టోబర్ లో వారిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. విజయ్ సన్నిహిత వర్గాలు ధ్రువీకరించినట్లు టాక్ వినిపించింది. దీంతో మరికొద్ది రోజుల్లో అఫీషియల్ గా అనౌన్స్ చేసి పిక్స్ రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు. సాధారణంగా ఏ సెలబ్రిటీల విషయంలో ఎప్పుడూ అదే సీన్ రిపీట్ అవుతుంటుంది.
కానీ ఇప్పటి వరకు విజయ్, రష్మిక ఎంగేజ్మెంట్ విషయాన్ని అఫీషియల్ గా రివీల్ చేయలేదు. ఎక్కడా లీక్ కూడా అవ్వలేదు. దీంతో ఎందుకలా చేస్తున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా రష్మిక.. ఓ పాడ్ కాస్ట్ లో తాను పెళ్లి చేసుకుంటే.. విజయ్ దేవరకొండ లాంటి వ్యక్తినే మ్యారేజ్ చేసుకుంటానని ఓపెన్ గా చెప్పారు.
కానీ ఎంగేజ్మెంట్ అయినట్లు రివీల్ చేయలేదు. ఆ తర్వాత రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుని సందడి చేస్తోంది. ఆ సినిమా సక్సెస్ మీట్ ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగ్గా.. విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేశారు.
దీంతో ఆ రోజు ఎంగేజ్మెంట్ మ్యాటర్ ను రివీల్ చేస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ విజయ్, రష్మిక ఆ సమయంలో ముద్దు పేర్లు విజ్జూ, రషి అంటూ పిలుచుకున్నారు. విజయ్.. అందరి ముందు.. మీడియా సమక్షంలో రష్మిక హ్యాండ్ పై కిస్ చేశారు. అయితే తాము పెళ్లి చేసుకుంటున్నట్లు మాత్రం ఇద్దరూ కూడా చెప్పలేదు.
అందుకే విజయ్, రష్మిక ప్లాన్ ఏంటి? ఎప్పుడు రివీల్ చేస్తారు? ఏదైనా ప్లాన్ లో ఉన్నారా అని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే బ్యాక్ గ్రౌండ్ లో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వివాహ వేదిక కోసం రష్మిక ఇటీవల ఉదయ్ పూర్ వెళ్లి చూసి వచ్చారని సమాచారం. త్వరలో అన్ని పనులు కంప్లీట్ చేయనున్నారని.. డెస్టినేషన్ వెడ్డింగ్ గ్రాండ్ గా చేసుకుంటారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో వేచి చూడాలి.