150 కోట్ల నుంచి 300 కోట్ల‌కు.. పెళ్లితో పీక్‌లో స్టార్ క‌పుల్

ఆ ర‌కంగా చూస్తే, ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక మంద‌న్న అల‌యెన్స్ లైఫ్ లో ఫుల్ గా సెటిలైన‌ట్టేన‌ని ఫైనాన్షియ‌ల్ ఎక్స్ ప‌ర్ట్స్ అంచ‌నా వేస్తున్నారు.;

Update: 2025-10-04 17:11 GMT

ఒక స్టార్ లైఫ్ లో సెటిల‌య్యాడా లేదా ఎలా చెప్ప‌గ‌లం. అత‌డి స‌క్సెస్ రేటు- ఫ్యాన్ ఫాలోయింగ్, సొంత గృహాలు- హోదా, పారితోషికం, ల‌గ్జ‌రీ కార్లు, వ్యాపారాల్లో పెట్టుబ‌డులు, భ‌విష్య‌త్ క‌మిట్ మెంట్లు.. ఇవ‌న్నీ చూడాలి. ఆ ర‌కంగా చూస్తే, ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక మంద‌న్న అల‌యెన్స్ లైఫ్ లో ఫుల్ గా సెటిలైన‌ట్టేన‌ని ఫైనాన్షియ‌ల్ ఎక్స్ ప‌ర్ట్స్ అంచ‌నా వేస్తున్నారు. ఈ జంట నిక‌ర ఆస్తుల విలువ సుమారు 150 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా.

విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక్కో సినిమాకి 15 కోట్ల మేర పారితోషికం అందుకుంటుంటే, ర‌ష్మిక మంద‌న్న ఏడాదికి నాలుగైదు సినిమాల్లో న‌టించేస్తూ ఏకంగా ఒక్కో సినిమాకి 4 నుంచి 12 కోట్ల వ‌ర‌కూ అందుకుంటోంది. బాలీవుడ్ లో సికంద‌ర్ సినిమాలో న‌టించినందుకు 13 కోట్లు అందుకుంద‌ని స‌మాచారం ఉంది. పుష్ప 2 కోసం 10 కోట్లు అందుకున్న ర‌ష్మిక త‌దుప‌రి బాలీవుడ్ చిత్రాల‌కు భారీ మొత్తంలో పారితోషికాలు అందుకుంటోంది.

విజ‌య్ కి జూబ్లీహ‌ల్స్ లో 15 కోట్ల ఖ‌రీదైన సొంత ఇల్లు ఉంది. అలాగే ఖ‌రీదైన కార్లు అత‌డి సొంతం.రూ.65 -68 లక్షల విలువైన బీఎండ‌బ్ల్యూ 5 సిరీస్, రూ.75 లక్షల విలువైన ఫోర్డ్ ముస్తాంగ్, రూ.64 లక్షల విలువైన రేంజ్ రోవర్ , రూ.85 లక్షల విలువైన వోల్వో XC90 ఉన్నాయి. దేవ‌ర‌కొండ నిక‌ర ఆస్తుల విలువ సుమారు 70 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని ఒక అంచ‌నా. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు రూ.1 కోటి, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు దాదాపు రూ.40 లక్షలు సంపాదిస్తాడు. అతడు రౌడీ బ్రాండ్ దుస్తుల‌ను యూత్ లో బాగా ఎక్కించాడు. అత‌డికి ఇది కూడా ఒక ప్ర‌ధాన ఆదాయ‌వ‌న‌రుగా మారింది.

రష్మిక మంద‌న్న నిక‌ర ఆస్తుల విలువ సుమారు 66 కోట్లు. ఈ బ్యూటీకి బెంగళూరులో రూ. 8 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు, ముంబై, గోవా, కూర్గ్ (స్వ‌స్థ‌లం), హైదరాబాద్ (మెట్టినిల్లు)లలో ఆస్తులు ఉన్నాయి. ఖ‌రీదైన కార్లు త‌న గ్యారేజీలో ఉన్నాయి. ఆడి క్యూ3, రేంజ్ రోవర్ స్పోర్ట్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా, మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ కార్ల‌ను త‌న సొంతం చేసుకుంది. విజ‌య్ - ర‌ష్మిక ఔటింగుల కోసం ఖ‌ర్చు ల‌క్ష‌ల్లోనే ఉంటుంది. ఈ జంట నిశ్చితార్థం సైలెంట్ గా కానిచ్చేసి, ఫిబ్ర‌వ‌రిలో మ‌నువాడేందుకు అద్భుత‌మైన డెస్టినేష‌న్ వెడ్డింగ్ వెతుకుతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. దాదాపు 150 కోట్ల నిక‌ర ఆస్తులు ఉన్న ఈ జంట‌, త‌మ ఆదాయాన్ని నాలుగైదేళ్ల‌లోనే డ‌బుల్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Tags:    

Similar News